శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 30 సెప్టెంబరు 2023 (22:47 IST)

01-10-2023 నుంచి 07.10.2023 వరకు మీ వార రాశిఫలాలు

weekly horoscope
మేషం : అశ్వని, భరణి1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
సంకల్పసిద్ధికి ఓర్పు ప్రధానం. విమర్శలు పట్టించుకోవద్దు. పట్టుదలతో యత్నాలు సాగించండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఆదాయం సంతృప్తికరం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ధనసహాయం తగదు. మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. బుధవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఉద్యోగస్తులు ప్రశంసలందుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల అలంకరణ ఆకట్టుకుంటుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయ వ్యయాలకు ఏమాత్రం పొంతన ఉండదు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. శుక్ర, శనివారాల్లో నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. సంతానం ధోరణి అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వేడుకకు హాజరవుతారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. మాటతీరుతో ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు. ప్రతిభాపాఠవాలు వెలుగులోకి వస్తాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆప్తులకు సాయం అందిస్తారు. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. సోదరీ సోదరుల వైఖరిలో మార్పు వస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. ఉద్యోగస్తులు ప్రశంసలందుకుంటారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వస్త్ర, పచారీ, మెడికల్ వ్యాపారాలు ఊపందుకుంటాయి. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు
అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. సంప్రదింపులు అనుకూలిస్తాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. సోమ, మంగళ వారాల్లో ఫోన్ సందేశాలను నమ్మవద్దు. అజ్ఞాతవ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. వాయిదా పడిన పనులు ఎట్టలకేలకు పూర్తవుతాయి. యోగ, ఆధ్యాత్మికతల పట్ల ఆసక్తి పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. నిరుద్యోగులకు ఓర్పు, పట్టుదల ప్రధానం. అవాహితులకు శుభయోగం. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిన్నవ్యాపారులకు ఆదాయాభివృద్ధి. జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
ఈ వారం అనుకూలదాయకం. పరిస్థితులు మెరుగుపడతాయి. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. అనాలోచిత నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. బాధ్యతలు అప్పగించవద్దు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. పత్రాల రెన్యువల్లో మెళకువ వహించండి. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు, కార్మికుల ఆదాయం బాగుంటుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. సంతానం యత్నాలు ఫలిస్తాయి. ప్రయాణం తలపెడతారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం వృధా కాదు. కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మానసికంగా స్థిమితపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఖర్చులు అధికం. అవసరాలకు ధనం అందుతుంది. వాయిదా వేసిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ఆహ్వానం అందుకుంటారు. వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితాలిస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు అవరమవుతాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. అపరిచితులతో జాగ్రత్త, ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
సంకల్పసిద్ధికి ఓర్పు ప్రదానం. పట్టుదలతో యత్నాలు సాగించండి. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. బుధవారం నాడు పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. ధనం మితంగా వ్యయం చేయండి. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. అయిన వారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ప్రధానం. అధికారులకు హోదామార్పు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సమర్ధతను చాటుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. పదవులు, సభ్యత్వాల స్వీకరణకు తగిన సమయం. బాధ్యతగా వ్యవహరించాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ప్రత్యర్థుల ఎత్తుగడలు ఆందోళన కలిగిస్తాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఇతరుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. సన్నిహితుల సలహా పాటించండి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గురు, శుక్రవారాల్లో పనులు ఒక పట్టాన సాగవు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఓర్పుతో మెలగండి. సంతానం యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను తట్టుకుంటారు. ఉపాధ్యాయులకు పనిభారం. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. సభలు, కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
వ్యవహారానుకూలత ఉంది. సమస్యల నుంచి బయటపడతారు. మీ ప్రయత్నం వృధా కాదు. కొంత మొత్తం ధనం అందుతుంది. అవసరాలు తీరుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఆదివారం నాడు కొంతమంది రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు సాగవు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారి ఆదాయం బాగుంటుంది. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు అందుకుంటారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పనులు చురుకుగా సాగుతాయి. వ్యతిరేకులను ఆకట్టుకుంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఆశించిన పదవులు దక్కవు. పట్టుదలతో యత్నాలు సాగించండి. మంగళ, బుధవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. బంధువులతో సంబంధాలు బలపడతాయి. పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులకు శుభయోగం. అధికారుల మన్ననలు పొందుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నూతన పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
ఆత్మస్థైర్యంతో మెలగండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. సన్నిహితులు సహాయం అందిస్తారు. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అపరిచితులను నమ్మవద్దు. శుక్ర, శనివారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితాలిస్తాయి. ఆరోగ్యం సంతృప్తికరం. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. కీలక పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ఉపాధ్యాయులకు పనిభారం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. సేవ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. దైవ దర్శనాల్లో ఒకింత అవస్థలు తప్పవు. 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
సంప్రదింపులతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాలభోజనం. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఆప్తుల సాయంతో అవసరాలు నెరవేరుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆదివారం నాడు అపరిచితులతో జాగ్రత్త. ఆర్థిక వివరాలు వెల్లడించవద్దు. కొంతమంది తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. సంతానం విషయంలో శుభం జరుగుతుంది. గృహమార్పు కలిసివస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఉపాధ్యాయులకు స్థానచలనం ఇబ్బంది కలిగిస్తుంది. వస్త్ర, పచారీ, ఫ్యాన్యీ వ్యాపాపాలు ఊపందుకుంటాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. బిల్డర్లు, కార్మికులకు కష్టకాలం.