గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 14 అక్టోబరు 2023 (20:35 IST)

15-10-2023 నుంచి 21.10.2023 వరకు మీ వార రాశిఫలాలు

weekly horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. బాధ్యతగా మెలగాలి. వ్యతిరేకులతో జాగ్రత్త. ఖర్చులు అంచనాలను మించుతాయి. మీ ఉన్నతిని చాటుకోవటానికి వ్యయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. శనివారం నాడు ఆప్తుల కలయక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సంతానం భవిష్యత్తుపై దృష్టి సారిస్తారు. ఒక సమాచారం సంతోషపరుస్తుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గృహంలో సందడి నెలకొంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. దైవదర్శనంలో అవస్థలెదుర్కుంటారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
మీదైన రంగంలో రాణిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఆప్తులకు సాయం అందిస్తారు. సోమవారం నాడు చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్థంలో జాగ్రత్త. స్థోమతకు మించి హామీలివ్వవద్దు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. అధికారులకు ఒత్తిడి, పనిభారం. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. స్థల వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. దైవదీక్షలు స్వీకరిస్తారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
మీ మాటకు ఎదురుండదు. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. పదవుల స్వీకరణకు అడ్డంకులు తొలగుతాయి. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఆదాయం సంతృప్తికరం. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. బుధవారం నాడు చేసిన పనులే చేయవలసి వస్తుంది. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. అనునయంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాల్లో ఆటుపోట్లను అధిగమిస్తారు. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్రేష 1, 2, 3, 4 పాదములు
వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులు, ఏజెన్సీలను నమ్మవద్దు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. మీ శ్రీమతిలో ఆశించిన మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. సంతానం యత్నాలు ఫలిస్తాయి. గురువారం నాడు నగదు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆశించిన పదవులు దక్కవు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఉపాధ్యాయులకు పదోన్నతి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
సింహం : 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది. విమర్శలు పట్టించుకోవద్దు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. వాయిదా పడుతున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. శుక్ర, శనివారాల్లో అప్రమత్తంగా ఉండాలి. నమ్మకస్తులే తప్పుదారి పట్టించే ఆస్కారం ఉంది. బాధ్యతలు అప్పగించవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. కీలక పత్రాలు అందుకుంటారు. మీ సహాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. అధికారులకు అదనపు బాధ్యతలు. వ్యాపారాల్లో ఒడిదుడుకులను తట్టుకుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. పందాల జోలికి పోవద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. వ్యాపకాలు అధికమవుతాయి. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఆదివారం నాడు ఖర్చులు విపరీతం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. వ్యతిరేకులను సామరస్యంగా ఆకట్టుకోవాలి. ఆహ్వానం అందుకుంటారు. గృహాలంకరణల పట్ల ఆసక్తి పెంపొందుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు జాగ్రత్త. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. సాంకేతిక రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. రిప్రజెంటేటివ్‌లు టార్గెట్లను పూర్తి చేస్తారు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ప్రయాణంలో అవస్థలు తప్పవు.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
ప్రతికూలతలతో సతమతమవుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. చీటికి మాటికి అసహనం చెందుతారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. అయిన వారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. ఆప్తుల వ్యాఖ్యలు మీపై మంచి ప్రభావం చూపుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. సోమ, మంగళవారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. షాపు పనివారలతో జాగ్రత్త. ఆధ్యాత్మికతపై ఆసక్తి కలుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కొంతమంది వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. విమర్శలు పట్టించుకోవద్దు. మీ సమర్థతపై సమర్ధతపై నమ్మకం పెంచుకోండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు చేయాలన్న ఆలోచన ఫలించదు. బుధవారం నాడు పరిచయం లేని వారితో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. పనులు ఒక పట్టాన సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. దాంపత్య సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
అవకాశాలను అందిపుచ్చుకుంటారు. పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. బాధ్యతగా మెలగాలి. ఆత్మీయుల ఆహ్వానం సంతోషాన్నిస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేయగల్గుతారు. గృహం సందడిగా ఉంటుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పెట్టుబడులకు అవకాశం లేదు. గురు, శుక్రవారాల్లో ఎవరినీ అతిగా నమ్మవద్దు. కొత్త వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు అవసరం. ధార్మిక విషయాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టకాలం. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
ధైర్యంగా వ్యవహరిస్తారు. మీ మనోబలమే మిమ్ములను ముందుకు నడిపిస్తుంది. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. శనివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. సంతానం యత్నాలు ఫలిస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు కొత్త ఇబ్బందులెదురవుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు ప్రశాంతంగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు, కార్మికులకు ఆదాయాభివృద్ధి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
ఈ వారం ప్రశాంతంగా గడుస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆదాయం బాగుంటుంది. దైవకార్యాలకు వ్యయం చేస్తారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆహ్వానం అందుకుంటారు. సంతానం ధోరణి అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. ఆగ్రహావేశాలకు గురికావద్దు. ఆరోగ్యం జాగ్రత్త. ఆత్మీయుల రాక సంతోషాన్నిస్తుంది. ఆశించిన పదవులు దక్కవు. ఇదీ ఒకందుకు మంచిదే. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఉద్యోగస్తుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో ఆటంకాలను అధిగమిస్తారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
విమర్శలు పట్టుదలను రేకెత్తిస్తాయి. కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. యత్నాలకు కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. శనివారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలించవు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత అనుభవాలు ఉల్లాసాన్నిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. వ్యాపారాల్లో ఆటంకాలను అధిగమిస్తారు. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. దైవదర్శనాల్లో అవస్థలెదుర్కుంటారు.