సోమవారం, 9 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By వరుణ్
Last Updated : శనివారం, 4 నవంబరు 2023 (22:34 IST)

05-11-2023 నుంచి 11.11.2023 వరకు మీ వార ఫలితాలు..

weekly horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదము
ప్రతికూలతలు అధికం. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. దంపతుల మధ్య తరచూ కలహాలు, సామరస్యంగా మెలగండి. గురువారం నాడు చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. మీపై శకునాల ప్రభావం అధికం. ఆప్తులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులు, ఏజెన్సీలను నమ్మవద్దు. గృహ మరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. నూతన పెట్టుబడులు కలిసిరావు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. యోగ, ధార్మిక విషయాలపై ఆసక్తి పెంపొందుతుంది. ఆలయాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
ఆత్మస్థైర్యంతో మెలగండి. అపజయాలకు కుంగిపోవద్దు. ఓర్పుతో యత్నాలు సాగించండి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆదాయం అంతంత మాత్రమే. ఖర్చులు అధికం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ఆత్మీయుల ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి. మంగళ, బుధవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. పాత మిత్రులు తారసపడతారు. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. (ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టసమయం. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. శుభకార్యానికి హాజరవుతారు. మీ రాక బంధుమిత్రులను సంతోషపరుస్తుంది.
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
ఆర్థికలావాదేవీలు సంతృప్తినిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. శుక్రవారం నాడు నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఆప్తులకు వివాహ సమాచారం అందిస్తారు. సంతానం మొండితనం అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. ఆరోగ్యం బాగుంటుంది. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
సంకల్పం సిద్ధిస్తుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుతాయి. ఆదాయవ్యయాలు సంతృప్తికరం. ప్రణాళికలు వేసుకుంటారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆది, శనివారాల్లో అనుకోని సంఘటనలెదురవుతాయి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. మధ్యవర్తులు, ఏజెన్సీలను విశ్వసించవద్దు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. నిరుద్యోగులకు ఏకాగ్రత, కృషి ప్రధానం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. నూతన వ్యాపారాలు కలిసిరావు. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
ఆర్థికంగా బాగుంటుంది. రుణసమస్యలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. గ్రహం ప్రశాంతంగా ఉంటుంది. బంధుత్వాలు బలపడతాయి. ఆత్మీయుల ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. సోమవారం నాడు అనుకున్న విధంగా పనులు సాగవు. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. బాధ్యతలు అప్పగించవద్దు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. యోగ, ధార్మికతల పట్ల ఆసక్తి పెంపొందుతుంది. అధికారులకు హోదా మార్పు, పనిభారం. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. వృత్తుల వారికి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థలమార్పు అనివార్యం. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. మంగళ, బుధవారాల్లో ఖర్చులు విపరీతం. పొదుపు చేయాలన్న మీ ఆలోచన ఫలించదు. సంతానం ధోరణి అసహనం కలిగిస్తుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. ఆహ్వానాలు అందుకుంటారు. చిన్ననాటి పరిచయస్తుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే కలిసివస్తాయి. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. నిరుద్యోగులకు శుభయోగం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వాయిదా వేసిన మొక్కులు తీర్చుకుంటారు.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. దంపతుల మధ్య అవగాహన లోపం. చీటికిమాటికి అసహనం చెందుతారు. ప్రశాంతంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. ఆప్తులతో కాలక్షేపం చేయండి. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఉపాధి పథకాలు చేపడతారు. కొత్త పరిచయాలేర్పడతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి, పనిభారం. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఈ వారం కొంత మేరకు ఆశాజనం. కొన్ని సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పనుల ప్రారంభంలో అవాంతరాలు ఎదురవుతాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. యత్నాలకు అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. సొంతంగా ఏదైనా చేయాలన్న ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. న్యాయ, వైద్య రంగాల వారికి ఆశాజనకం. ఆత్మీయులతో సంభాషిస్తారు. భూ సంబంధిత వివాదాలు కొలిక్కివస్తాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
ఆర్థికలావాదేవీలతో సతమతమవుతారు. శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. మనోధైర్యంతో మెలగండి. ఈ చికాకులు తాత్కాలికమే. పరిస్థితులు త్వరలో చక్కబడతాయి. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆదివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
సంకల్పం సిద్ధిస్తుంది. అందరితో కలుపుగోలుగా మెలుగుతారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. కల్యాణ వేదికలు అన్వేషిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. గృహాలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. పనులు హడావుడిగా సాగుతాయి. శుక్రవారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవాభిమానాలకు భంగం కలుగుండా మెలగండి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. బిల్డర్లు, కార్మికులకు కష్టసమయం. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
లక్ష్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. యత్నాలకు కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. వ్యవహారాలతో సతమతమవుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. సోమ, మంగళవారాల్లో నగదు, ఆభరణాలు జాగ్రత్త. అపరిచితులతో మితంగా సంభాషించండి. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. దాంపత్య సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు చేపడతారు. షాపుల అలంకరణ ఆకట్టుకుంటుంది. భవన నిర్మాణాలు ఊపందుకుంటాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
అనుకూలతలు అంతంత మాత్రమే. చిన్న విషయమే సమస్యాత్మకమవుతుంది. మనోధైర్యంతో వ్యవహరించండి. విమర్శలు, అభియోగాలు పట్టించుకోవద్దు. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆరోగ్యం బాగుంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. మీ అభిప్రాయాలను పెద్దల ద్వారా తెలియజేయండి. శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. ప్రముఖులకు స్వాగతం, వీడ్కోలు పలుకుతారు.