శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 23 డిశెంబరు 2023 (23:17 IST)

24-12-2023 నుంచి 30-12-2023 వరకు మీ వార రాశిఫలాలు

weekly horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
మనోధైర్యంతో శ్రమించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. పనుల్లో శ్రమ, చికాకులు అధికం. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. సన్నిహితులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. మంగళ, బుధవారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. ఆరోగ్యం సంతృప్తికరం. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలకు అనుకూలం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
గ్రహాల సంచారం అనుకూలంగా లేదు. ప్రతికూలతలతో సతమతమవుతారు. రుణ సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. అతిగా ఆలోచింపవద్దు. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. శుక్రవారం నాడు ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పదవీయోగం. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల అలంకరణతో వ్యాపారాలు పుంజుకుంటాయి. వృత్తుల వారికి సామాన్యం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆచితూచి అడుగేయాలి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. ఆత్మీయుల సలహా పాటించండి. చీటికి మాటికి అసహనం చెందుతారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. ఆది, శనివారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుపడదు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. కీలక పత్రాలు అందుకుంటారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరువ్యాపారులకు కష్టసమయం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవవద్దు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ధనలాభం, వాహనయోగం పొందుతారు. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేయగలుగుతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు. సోమ, మంగళవారాల్లో పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. ఆరోగ్యం కుదుటపడతుంది. ఉల్లాసంగా గడుపుతారు. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులు ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వేడుకకు గైర్హాజరవుతారు. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
సంతోషకరమైన వార్తలు వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. అనుకున్నది సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. వ్యాపకాలు అధికమవుతాయి. బుధవారం నాడు పనులు సాగవు. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. మీ ప్రమేయంతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరచరాస్తుల వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఆత్మీయులతో సంభాషిస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. అధికారులకు హోదామార్పు. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆశించిన ఫలితాలు సాధిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. గురు, శుక్రవారాల్లో అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. నిశ్చితార్థంలో జాగ్రత్త. సాధ్యం కాని హామీలివ్వవద్దు. గృహ అలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభయోగం. ఉద్యోగసులకు పనిభారం, విశ్రాంతి లోపం. వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కంప్యూటర్ రంగాల వారికి నిరాశాజనకం. శుభకార్యంలో పాల్గొంటారు.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
సంకల్పం సిద్ధిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అయిన వారి ప్రోత్సాహం ఉంది. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహంలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంటుంది. శనివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. పత్రాలు, నగదు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాస్తుదోష నివారణ చర్యలు అనివార్యం. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. ఆత్మీయులతో సంభాషణ ఉల్లాసం కలిగిస్తుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు 
మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా తెలియజేయండి. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఆప్తుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. వ్యవహారాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. వేదికలు అన్వేషిస్తారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభయోగం. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. ప్రముఖులకు స్వాగతం, వీడ్కోలు పలుకుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ధనసమస్యలు ఎదురవుతాయి. ఆపత్సమయంలో అయన వారు సాయం అందిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. విశ్రాంతి అవసరం. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. పనుల్లో శ్రమ, చికాకులు అధికం. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
ఆర్థికస్థితి సామాన్యం. పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పెట్టుబడులకు తరుణం కాదు. ఆది, సోమవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. సన్నిహితులతో సంభాషణ నూతనోత్సాహాన్నిస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. గృహ మరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వేడుకకు హాజరవుతారు. బంధుమిత్రుల ఆతిథ్యం సంతృప్తినిస్తుంది. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు 
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. ఆశించిన ఫలితాలు సాధిస్తారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆదాయం బాగుంటుంది. పెట్టుబడులపై దృష్టి పెడతారు. వ్యవహారాలు పురోగతిన సాగుతాయి. మంగళ, బుధవారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కీలక పత్రాలు అందుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఆశించిన పదవులు దక్కవు. ఇదీ మంచికేనని భావించండి. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ పథకాలు మున్ముందు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు శుభయోగం. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. కళాకారులకు ప్రోత్సాహకరం. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
వాగ్ధాటితో రాణిస్తారు. సంప్రదింపులు ఫలిస్తాయి. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. సమిచిత నిర్ణయాలు తీసుకుంటారు. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆపన్నులకు సాయం అందిస్తారు. బంధుమిత్రులతో సంబంధాలు బలపడాయి. వివాహయత్నం ఫలిస్తుంది. జాతక పొంతన ప్రధాననం. శనివారం నాడు పనులు ఒక పట్టాన సాగవు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్తులకు పురోభివృద్ధి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు.