బుధవారం, 15 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 అక్టోబరు 2025 (15:06 IST)

జైలుకు వెళ్లినందుకు బాధగా లేదు.. మేమే చంపామని ప్రచారం చేయడం బాధగా ఉంది : వినుత కోట

vinutha kota
తమ వ్యక్తిగత కారు డ్రైవర్ రాయుడు హత్య కేసులో తమకెలాంటి సంబంధం లేదని శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్‌చార్జ్ కోట వినుత అన్నారు. ఈ మేరకు ఆమె ఓ  వీడియోను విడుదల చేశారు. ఇందులో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. "చేయని తప్పునకు మేం జైలుకు వెళ్లినందుకు బాధగాలేదు. మేమే చంపామని ప్రచారం చేయడం బాధగలిగింది. రాయుడు హత్యలో మా ప్రమేయం లేదని కోర్టు భావించినందునే 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. విదేశాల్లో లక్షల రూపాయల వేతనాలు వదులుకుని రాజకీయాల్లో వచ్చింది ప్రజలకు సేవ చేయడానికే కానీ, మనుషుల ప్రాణాలు తీయడానికి కాదు. మాది అలాంటి మనస్తత్వం కాదు" అన్నారు.
 
ఈ కేసుతో తమకెలాంటి సంబంధం లేదని నిరూపించుకోవడంతో పాటు పాటు కేసులో నిర్దోషులుగా బయటపడతామన్నారు. న్యాయస్థానంలో ఈ కేసు విచారణలో ఉన్నందున ఈ అంశం గురించి ఇంతకుమించి మాట్లాడుకూడదని న్యాయవాదులు తెలిపారు. తనపై జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలు, ఆధారాలతో త్వరలో మీ ముందుకు వస్తాం. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది అని కోట వినుత అన్నారు.