శనివారం, 4 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2023 (12:05 IST)

17.12.2023 నుంచి 23.12.2023 వరకు మీ వార రాశిఫలాలు

horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. పరిచయస్తుల వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. పట్టుదలతో శ్రమిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. పనులు చురుకుగా సాగుతాయి. ఆది, సోమ వారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధుత్వాలు బలపడతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. సంతానం దూకుడు అదుపుచేయండి. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. అధికారులకు బాధ్యతల మార్పు. స్థానచలనం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
ఆర్థికలావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఖర్చులు విపరీతం. ధనసమస్యలెదురవుతాయి. ఆప్తుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కలిసివచ్చిన అవకాశాలను వదులుకోవద్దు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. బుధవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పత్రాలు అందుకుంటారు. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. నిరుద్యోగులకు శుభయోగం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
సంకల్పం సిద్ధిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు బలపడతాయి. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. గుట్టుగా మెలగండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. సోమ, మంగళ వారాల్లో చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. మీపై శకునాల ప్రభావం అధికం. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. పాత మిత్రులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. ఆహ్వానం అందుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. సేవ, సాంకేతిక రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు
సమర్ధతను చాటుకుంటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ధనలాభం, వాహనయోగం పొందుతారు. పదవులు, బాధ్యతల స్వీకరణకు అనుకూలం. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు. కొంతమంది మీ ఆలోచనలు నీరుగార్చేందుకు యత్నిస్తారు. బుధవారం నాడు ఖర్చులు అధికం. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు అవసరమవుతాయి. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ముఖ్యులకు స్వాగతం, వీడ్కోలు పలుకుతారు. 
 
సింహం : మఖ పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. సంప్రదింపులు ఫలిస్తాయి. పెట్టుబడుల వ్యవహారంలో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. కీలక పత్రాలు అందుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మీ శ్రీమతి సలహా పాటిస్తారు. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. మీ అభిప్రాయాలనరు స్పష్టంగా తెలియజేయండి. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ తగదు. గురువారం నాడు పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
కార్యం సిద్ధిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది. గుట్టుగా యత్నాలు సాగించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. నూతన దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఉపాధి పథకాలు చేపడతారు. వృత్తుల ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
ఈ వారం యోగదాయకమే. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. ప్రముఖులతో సంబంధాలేర్పడతాయి. సంప్రదింపులకు అనుకూలం. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. మీ నిర్ణయం ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అతిగా శ్రమించవద్ద్దు. విశ్రాంతి అవసరం. శ్రీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. నిరుద్యోగులకు శుభయోగం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. వ్యవసాయ రంగాల వారికి నిరాశాజనకం. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు సానుకూలమవుతాయి. శుక్ర, శని వారాల్లో అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ శ్రీమతి సలహా పాటించండి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. గృహమార్పు కలిసివస్తుంది. అవివాహితులకు శుభయోగం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. అవకాశాలు చేజారిపోతాయి. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. ఆదివారం నాడు పనులు సాగవు. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. సంతానం విషయంలో శుభం జరుగుతుంది. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. ఒక వ్యవహారం వివాదాస్పదమవుతుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. పందాలు, బెట్టింగ్‌లకు పాల్పడవద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
గ్రహాల సంచారం అనుకూలంగా లేదు. ఆచితూచి వ్యవహరించాలి. మంచి చేయబోతే చెడు ఎదురువుతుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ధనసమస్యలెదురవుతాయి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఈ చికాకులు తాత్కాలికమే. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. త్వరలో పరిస్థితులు మెరుగుపడతాయి. సోమవారం నాడు ప్రముఖులను కలిసినా ఫలితం ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు. ధార్మిక విషయాల పట్ల ఆసక్తి పెంపొందుతుంది. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. అధికారులకు కొత్త బాధ్యతలు. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
 
ఆర్ధికలావాదేవీలు కొలిక్కి వస్తాయి. కొన్ని సమస్యల నుంచి విముక్తులవుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ప్రణాళికబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆపన్నులకు సాయం అందిస్తారు. మీ జోక్యం అనివార్యం. మీ సలహా ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. మంగళ, బుధ వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పెట్టుబడులకు తరుణం కాదు. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఆదివారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం సద్వినియోగం చేసుకోండి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఆప్తులతో ఉల్లాసంగా గడపుతారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులకు పదవీయోగం. నూతన వ్యాపారాలు కలిసివవస్తాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. చిరువ్యాపారులకు ఆశాజనకం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.