సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

02-01-2024 మంగళవారం దినఫలాలు - కార్తీకేయుడిని పూజించినా మీ మనోవాంఛలు...

Weekly Horoscope
శ్రీ శోభకృత్ నామ సం|| మార్గశిర బ|| షష్ఠి ప.2.29 పుబ్బ ఉ.9.55 సా.వ. 5.53 ల 7.39.
ఉ.దు. 8.46 ల 9.30 రా.దు. 10.45 ల 11.37.
 
కార్తీకేయుడిని పూజించినా మీ మనోవాంఛలు నెరవేరుతాయి.
 
మేషం :- పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ప్రసంసలు అందుకుంటారు. ఆదాయానికి మించి ఖర్చులు అధికంగా ఉంటాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. బంధువులలో మంచి పేరు, ఖ్యాతి పొందుతారు. ఎదుటివారితో సంభాషించేటప్పుడు జాగ్రత్త అవసరం.
 
వృషభం :- వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఊహించని ఖర్చులు అధికమవుతాయి. మీ అభిప్రాయాలు, ఆలోచనలు గోప్యంగా ఉంచటం మంచిది. అకాల భోజనం, ప్రశాంతత లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు, బ్యాంకు పనులో ఏకాగ్రత వహించండి.
 
మిథునం :- కుటుంబ సభ్యులతో కలిసి విందులు, వేడుకలలో పాల్గొంటారు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. కుటుంబం పట్ల బరువు బాధ్యతలు అధికమవుతాయి. మీ సంతానం కోసం ధనం బాగా వ్యయం చేయవలసివస్తుంది.
 
కర్కాటకం :- వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారాల పట్ల ఏకాగ్రత పెరుగుతుంది. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి గడిస్తారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తితో పాటు అవకాశాలు కలిసివస్తాయి. బంధువులతో సఖ్యత, రాకపోకలు పునఃప్రారంభమవుతాయి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం.
 
సింహం :- భాగస్వామిక చర్చలు సంప్రదింపులు ప్రశాంతంగా ముగుస్తాయి. మీ సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. పంతాలకు పోకుండా బంధువులతో ఆదరంగా మెలగండి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. ఇసుక కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి. 
 
కన్య :- ఎటువంటి స్వార్ధచింతన లేకుండా ఇతరులకు సహాయం చేస్తారు. మీ సంతానం మొండివైఖరిమీకు చికాకు కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్త్రీలకు పనివారితో చికాకులను ఎదుర్కొంటారు. విదేశాలు వెళ్ళటానికి చేయు యత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ కార్యక్రమాలలోని పనులు అనుకూలిస్తాయి.
 
తుల :- కుటుంబ విషయాలు, సాంఘిక వ్యవహారాలు సమర్థవంతంగా నడుపుతారు. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్న తనంగా భావించకండి. గత తప్పిదాలు పునరావృతమయ్యే ఆస్కారం ఉంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి.
 
వృశ్చికం :- ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. ధనం చేతిలో నిలబడటం కష్టం కావచ్చు. శతృవులపై విజయం సాధిస్తారు. ఉద్యోగస్తుల శక్తి సామర్ధ్యాలను అధికారులు గుర్తిస్తారు. సాంస్కృతిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలు అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది.
 
ధనస్సు :- కాంట్రాక్టర్లు, బిల్డర్లకు పనివారలతో సమస్యలు తలెత్తుతాయి. మిత్రుల కారణంగా మీ కార్యక్రమాలు మార్చుకోవలసివస్తుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాల్లో నిలదొక్కుకుంటారు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. మీ ఏమరుపాటు వల్ల వస్తువులు చేజార్చుకుంటారు.
 
మకరం :- విద్యా, వైజ్ఞానిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మంచిమాటలతో ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవటానికి యత్నించండి. స్త్రీలకు సంపాదపట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్థిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది.
 
కుంభం :- కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ పనులు మందకొడిగా సాగుతాయి. డబ్బు పోయినా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు.
 
మీనం :- పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీ బంధవులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. ప్రయత్నపూర్వకంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. రాబోయే ఆదాయానికి తగినట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు.