గురువారం, 12 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

29-12-2023 శుక్రవారం దినఫలాలు - శ్రీమహాలక్ష్మీని ఎర్రని పూలతో పూజించిన...

horoscope
శ్రీ శోభకృత్ నామ సం|| మార్గశిర ఐ|| విదియ ఉ.6.45 పుష్యమి రా.2.32 ఉ.వ.9.16 ల 11.00. ఉ. దు. 8. 29 ల 9.13 పు. దు. 12.10 ల 12.54.
శ్రీమహాలక్ష్మీని ఎర్రని పూలతో పూజించిన సంకల్పం సిద్ధిస్తుంది.
 
మేషం :- ఆలయాలను సందర్శిస్తారు. ఉమ్మడి, సొంత వ్యాపారాల అభివృద్ధికి బాగా శ్రమిస్తారు. వేడుకలు, పార్టీల్లో మితంగా వ్యవహరించండి. దంపతుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ముఖ్యం. మీ వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. 
 
వృషభం :- ఆర్థిక విషయాలలో కొంత పురోగతి సాధిస్తారు. మీ ఆలోచనలు స్థిమితంగా ఉండవు. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభిస్తారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోనికి ఓర్పు, నేర్పు చాలా అవసరం. పాత రుణాలు తీరుస్తారు. ఉద్యోగస్తులు వేడుకల్లో ఉల్లాసంగా పాల్గొంటారు.
 
మిథునం :- వస్త్ర, గృహోపకరణ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం. ఉద్యోగస్తులకు పై అధికారులు నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. చేపట్టిన పనులు బంధువుల కారణంగా అర్ధాంతరంగా ముగించాల్సివస్తుంది.
 
కర్కాటకం :- కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులను కలుసుకుంటారు. ఉన్నతాధికారులకు తనిఖీలు, పర్యవేక్షణలలో ఏకాగ్రత ముఖ్యం. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి.
 
సింహం :- వస్త్ర, బంగారం, వెండి వ్యాపారులకు పురోభివృద్ధి. హోటల్, కేటరింగ్ రంగాల వారికి లాభదాయకం. నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాల దిశగా సాగుతాయి. రాజకీయ నాయకులకు విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలలో మెళుకువ అవసరం. స్త్రీలు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
 
కన్య :- ఉద్యోగస్తులు విలువైన కానుకలు అందించి అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. మీ శ్రీమతి ప్రోత్సాహంతో ఒక శుభకార్యానికి యత్నాలు మొదలు పెడతారు. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. ఖర్చులు అధికమవుతాయి. విద్యార్థులు అపరిచిత వ్యక్తులతో అధికంగా సంభాషించడం శ్రేయస్కరంకాదు.
 
తుల :- ఆర్థిక ఇబ్బందులు లేకున్నా తెలియని అసంతృప్తి వెన్నాడుతుంది. స్థిరాస్తులు, వాహనం కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి విందులు, వేడుకులలో చురుకుగా పాల్గొంటారు. నిర్మాణాలలో నాణ్యత లోపం వల్ల కాంట్రక్టర్లు నష్టపోయే ఆస్కారం ఉంది. ఖర్చులు, చెల్లింపులు అధికంగా ఉంటాయి.
 
వృశ్చికం :- విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో లౌక్యం అవసరం. కొంతమంది మీ నుండి ధనం లేక ఇతరత్రా సహాయం అర్థిస్తారు. నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్, ప్రత్యేక ఇంక్రిమెంట్లు, బోనస్ వంటి శుభపరిణామాలుంటాయి. మీ సంతానంతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.
 
ధనస్సు :- చిన్నతరహా పరిశ్రమలు, స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. మీ సామర్ధ్యానికి ఆశించినంత ప్రతిఫలం లభిస్తుంది. శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. ముఖ్యమైన విషయాలు గోప్యంగాఉంచండి.
 
మకరం :- పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. స్త్రీలు కుటుంబ పరిస్థితులతో సర్ధుకుపోవడం క్షేమదాయకం. చేతి వృత్తుల వారు, నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకోవడం శ్రేయస్కరం.
 
కుంభం :- పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. విద్యార్థుల్లో మందకొడితనం, ఏకాగ్రత లోపం వంటి చికాకులు చోటుచేసుకుంటాయి. బంధువుల రాక ఉల్లాసాన్నిస్తుంది. పెద్దలను, గురువులను గౌరవించడంవల్ల మంచిగుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఆత్మీయుల నుంచి బహుమతులు అందుకుంటారు.
 
మీనం :- దైవ సేవా కార్యక్రమాలో చురుకుగా పాల్గొంటారు. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. మీ కళత్ర మొండివైఖరి, పట్టుదల మిమ్మల్ని ఇరకాటంలో పెడతాయి. ఇరుగు పొరుగు వారి వైఖరి వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు. సొంతంగా వ్యాపారం చేయాలనే దృక్పధం బలపడుతుంది.