గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

01-01-2024 సోమవారం దినఫలాలు - మల్లికార్జునుడిని ఆరాధించిన మీ సంకల్పం...

panchangam
శ్రీ శోభకృత్ నామ సం|| మార్గశిర బ॥ పంచమి ప.12.17 మఘ ఉ.7.17 సా.వ.4.09 ల 5.55. ప. దు. 12.24 ల 1.08 పు. దు. 2.36 ల 3.20.
మల్లికార్జునుడిని ఆరాధించిన మీ సంకల్పం సిద్ధిస్తుంది.
 
మేషం :- బంధు మిత్రులకు శుభాకాంక్షలు తెలుపుతారు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పొల్గొంటారు. మీశ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ముందుచూపుతో వ్యవహరించి ఒక సమస్య నుండి గట్టెక్కుతారు. ఒక వేడుకను ఘనంగా చేయటానికి సన్నాహాలు మొదలెడతారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు.
 
వృషభం :- వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ప్రభుత్వ సంస్థలలో పనులు పూర్తి అవుతాయి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. కుటుంబీకులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. 
 
మిథునం :- ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. పాత బాకీలు వసూలు చేయడం వల్ల ఆర్ధిక ఇబ్బంది తొలగిపోతాయి. నూతన వ్యక్తుల కలయిక సంభవించును. మీ సంతానం వల్ల ఆనందం, ఉత్సాహం పొందుతారు. కాంట్రాక్టులు, అగ్రిమెంటులు, పయాణాలు వ్యాపార లావాదేవిలపై శ్రద్ధ చూపుతారు.
 
కర్కాటకం :- ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగస్తుల శక్తి సామర్థ్యాలను అధికారులు గుర్తిస్తారు. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి పొందుతారు. అందరితో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. క్రొత్తగా ప్రణాళికలు రచించి వాటిని అమలు చేస్తారు. కుటుంబంలో నూతన ఉత్సాహం చోటుచేసుకుంటుంది. 
 
సింహం :- ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ప్రముఖలకు శుభాకాంక్షలు అందజేస్తారు. గృహంలో చికాకులు తొలగి ప్రశాంతత నెలకొంటుంది. మీ కళత్ర వైఖరిలో మార్పు సంతోషపరుస్తుంది. సన్నిహితులను విందులకు ఆహ్వానిస్తారు. బ్యాంకు పనిలు వాయిదాపడతాయి. బేకరి, తినుబండారాల వ్యాపారులకు లాభదాయకం.
 
కన్య :- ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. ప్రత్యర్ధుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఇతరులు మీ నుండి ధనసహాయం లేక చేత సహాయం కోరవచ్చు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి స్థానమార్పిడికి ఆస్కారం ఉంది. నూతనంగా పనులు చేపడతారు. ప్రకటనలు, మధ్యవర్తుల పట్ల అప్రమత్తత అవసరం.
 
తుల :- బంధుమిత్రుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. విద్యార్థులు విద్యా విషయాల్లో శ్రద్ధ వహించలేక పోవటం వల్ల పెద్దలతో మాట పడక తప్పదు. రావలసిన మొండిబాకీలు వసూలవుతాయి. సంఘంలో పలుకుబడి కల వ్యక్తులతో పరిచయాలు, తరుచు వారితో సంప్రదింపులు వంటి పరిణామాలు ఉంటాయి.
 
వృశ్చికం :- సాంఘిక, దై వ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా మీ తెలివితేటలతో పూర్తి చేయగలుగుతారు. స్త్రీలకు సన్నిహితుల నుండి అందిన ఆహ్వానాలు సంతృప్తినిస్తాయి. ఊహించని ఖర్చులు అధికమవుతాయి. బంధువుల రాక వల్ల మానసికంగా కుదుటపడతారు.
 
ధనస్సు :- డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. హామీలు, మధ్యవర్తిత్వాల విషయంలో మొహమ్మాటాలు కూడదు. ఉద్యోగస్తులు ఓర్పు, అంకితభావంతో పనిచేసి పెద్దలను, అధికారులను మెప్పిస్తారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు కలిసిరాగలదు. దైవ దర్శనాలు, మొక్కుబడులు అనుకూలిస్తాయి. 
 
మకరం :- విదేశాలు వెళ్ళటానికి చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహరాల్లో జయంచేకూరుతుంది. నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి పనిభారం అధికం అవుతుంది. పుణ్య క్షేత్రాలను సందర్శిస్తారు. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు.
 
కుంభం :- పీచు, ఫోం, లెదర్ వ్యాపారులకు కలిసిరాగలదు. స్థిరాస్తి అమ్మకం చేయాలనే మీ ఆలోచన కొంతకాలం వాయిదా వేయటం మంచిది. దైవ సేవా కార్యాలు, వేడుకల్లో చురుకుగా పాల్గొంటారు. విదేశాలలో ఉన్న బంధువులను శుభాకాంక్షలు అందజేస్తారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు.
 
మీనం :- వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలనిస్తాయి. వేడుకలో, విందులలో పరిమితి పాటించడం మంది. ఆధ్యాత్మిక, సేవా, సాంఘిక కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. షాపింగులోనూ, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత వహించండి. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది.