సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

03-01-2024 బుధవారం దినఫలాలు - దక్షిణామూర్తి పారాయణ చేయుట శ్రేయస్కరం...

horoscope
"యణపురం, విజయవా శ్రీ శోభకృత్ నామ సం|| మార్గశిర ఐ|| సప్తమి సా.4.35 ఉత్తర ప.12.29 రా.వ.9.42 ల 11.27,
ప. దు. 11. 43 ల 12.26.
దక్షిణామూర్తి పారాయణ చేయుట శ్రేయస్కరం.
 
మేషం :- ఆర్థిక, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి. మీ మాటతీరు, పద్ధతులను అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. కొంతమంది మీతో సన్నిహితంగా ఉంటూనే చాటుగా అపకారం తలపెట్టేందుకు యత్నిస్తారు. బంధువులను కలుసుకుంటారు. 
 
వృషభం :- పత్రికా సంస్థలలోని వారికి పనిభారం, విశ్రాంతి లోపం వంటి చికాకులు అధికమవుతాయి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. సమాచార లోపం వల్ల నిరుద్యోగులు ఒక అవకాశం చేజార్చుకుంటారు. ఉపాధ్యాకులు ఒత్తిడి అధికం. స్త్రీలకు వ్యాపకాలు, పరిచయాలు విస్తరిస్తాయి. 
 
మిథునం :- ఆర్థిక విషయాల్లో కొంత పురోగతి సాధిస్తారు. రాజకీయాలలోని వారికి ప్రత్యర్థులు పెరుగుతున్నారని గమనించండి. దూరప్రయాణాలు అనుకూలం. ఐరన్, సిమెంట్, కలప వ్యాపారస్తులకు మందకొడిగా ఉండగలదు. ఫైనాన్సు రంగాలలోని వారికి ఖాతాదారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. 
 
కర్కాటకం :- బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదుర్కొనవలసివస్తుంది. వాహనం అమర్చుకోవాలనేమీ కోరిక నెరవేరుతుంది. సాంఘిక కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. పత్రికా, మీడియా రంగాలవారికినూతన అవకాశాలు లభిస్తాయి.
 
సింహం :- కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. పాత మిత్రులతో విందు, వినోదాల్లో ఉల్లాసంగా గడుపుతారు. అధికారులతో వీలైనంత క్లుప్తంగా సంభాషించటం క్షేమదాయకం. విదేశీయానం, రుణయత్నాల్లో ఆటంకాలు, చికాకులు తప్పవు. స్త్రీలు విలువైన వస్తువులు, గృహోపకరణాలు సమకూర్చుకుంటారు.
 
కన్య :- పత్రికా, ప్రైవేటు రంగాల వారికి ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. సభా సమావేశాలలో పాల్గొనడం వల్ల ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఓర్పు, పట్టుదలతో శ్రమించినగాని చేపట్టిన పనులు పూర్తికావు. రుణాల కోసం అన్వేషిస్తారు. మీ యత్నాలకు మీ శ్రీమతి నుంచి ప్రోత్సాహం ఉంటుంది.
 
తుల :- ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. మీ కళత్ర మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేయుకృషి సత్ ఫలితాలనిస్తుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. అకాలభోజనం వల్ల స్త్రీలకు ఆరోగ్యం మందగిస్తుంది. 
 
వృశ్చికం :- బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మీ కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది. రవాణా రంగాలలోని వారికి చికాకులు తప్పవు. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. దుబారా ఖర్చులు అధికం. మీ లక్ష్యం పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి.
 
ధనస్సు :- స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. ఉద్యోగస్తులనకు పైఅధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. దీర్ఘకాలిక సమస్యలకు మంచి పరిష్కార మార్గం గోచరిస్తుంది. వాహనం కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు మిత్ర బృందాల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది మెళకువ వహించండి.
 
మకరం :- శ్రీవారు, శ్రీమతిగౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. ఏదైనా అమ్మకానికి చేయుప్రయత్నాలు వాయిదా పడుటమంచిది. సాహిత్య సదస్సులో పాల్గొంటారు. ఇతరులమెప్పు కోసం శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కొనవలసి వస్తుంది. నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చాలా అవసరం.
 
కుంభం :- ఆర్థిక పరిస్థితిలో కొంత పురోగతి కనిపిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉపాధ్యాయులు విద్యార్థుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. దంపతుల మధ్య మనస్పర్థలు చోటుచేసుకుంటాయి.
 
మీనం :- సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. ఆస్తి వ్యవహారాలలో సోదరులతో పోరు అధికమవుతుంది. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదు. చేపట్టిన పనులు అర్థాంతరంగా ముగించాల్సి వస్తుంది. స్త్రీలు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం.