1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 17-02-2024 Daily Astrology

17-02-2024 శనివారం దినఫలాలు - ఆంజనేయస్వామిని తమలపాకులతో పూజించిన శుభం...

anjaneya swamy
శ్రీ శోభకృత్ నామ సం|| మాఘ శు॥ అష్టమి ప.1.18 కృత్తిక ప.1.39 తె.వ.5.30 ల ఉ. దు. 6.35 ల 8.06.
అభయ ఆంజనేయస్వామిని తమలపాకులతో పూజించిన శుభం కలుగుతుంది.
 
మేషం :- మీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలియజేయండి. సిమెంటు, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. కుటుంబంలో ఖర్చుల నిమిత్తం ఎక్కువ ధనం వెచ్చించవలసి వస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. రిప్రజెంటేటివ్‌లు, ప్రైవేటు సంస్థలలోని వారికి ప్రగతితో కూడిన అవకాశాలులభిస్తాయి.
 
వృషభం :- ఉద్యోగస్తులు అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులు ఎదుర్కుంటారు. స్త్రీలు విలువైన వస్తువులు, గృహోపకరణాలు అమర్చుకుంటారు. బాకీలు, ఇంటి అద్దెల వసూలులో సౌమ్యంగా మెలగాలి. భాగస్వామి వ్యాపారాల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. విద్యార్థులు భయాందోళనలు వీడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి. 
 
మిథునం :- మీ ఆశయాలు, అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. మీ కళత్ర సహకారంతో ఒక సమస్య పరిష్కారంకాగలదు. మీ పనులు మందకొడిగా సాగుతాయి. హోటల్ తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి సామాన్యంగా ఉంటుంది. వాగ్వివాదాలకు, ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం మంచిది.
 
కర్కాటకం :- ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. బంధువులరాకతో గృహంలో కొంత అసౌకర్యానికి గురవుతారు. ఇప్పటివరకు విరోధులుగా ఉన్నవారు మీ సహాయం అర్థిస్తారు. గతంలో వాయిదా పడిన పనులు పునఃప్రారంభిస్తారు. ఖర్చులు పెరిగినా సమయానికి కావలసిన ధనం సర్దుబాటు కాగలదు.
 
సింహం :- ఆర్థిక వ్యవహారాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఆప్తుల ద్వారా సంతోషకరమైన వార్తలువింటారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. దంపతుల మధ్య అవగాహనాలోపం చికాకులు వంటివి చోటుచేసుకుంటాయి. స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా పరిష్కరింపబడతాయి.
 
కన్య :- రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు వేస్తారు. మీ అలవాట్లు, బలహీనతలు ఇబ్బందులకు దారితీస్తాయి. ఉద్యోగస్తులకు అధికారులతో చికాకులు ఎదురవుతాయి. మీ మాటకు వ్యతిరేకత, అపఖ్యాతి వంటి చికాకులు అధికమవుతాయి.
 
తుల :- సమావేశానికి ఏర్పాట్లుచేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. దూర ప్రయాణాలు చేయవలసివస్తుంది. విద్యార్థులో భయాందోళనలు చోటు చేసుకుంటాయి. దైవ సేవా సామాజిక కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. చేతి వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. రుణయత్నం ఫలించి ధనం చేతికందుతుంది.
 
వృశ్చికం :- బ్యాంకు వ్యవహారాలు అనుకూలం. ధన వ్యయంలో ఏకాగ్రత వహించండి. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని ప్రతికూలత లెదురవుతాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో, ఇంటర్వ్యూలలో నిరాశ తప్పదు. బంధువుల రాకతో ఇబ్బందులు ఎదుర్కుంటారు.
 
ధనస్సు :- సొంతంగా వ్యాపారం చేయాలనే మీ దృక్పథం బలపడుతుంది. కుటుంబీకులతో కలసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఆలయాలను సందర్శిస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం. దూర ప్రయాణాలు చేయవలసివస్తుంది. తెలివిగా వ్యవహరిస్తున్నామనుకుని తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది.
 
మకరం :- స్త్రీలకు తల, నరాలు, సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ధనసహాయం అర్ధించటానికి అభిజాత్యం అడ్డువస్తుంది. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. మీ ప్రమేయం లేకుండానేకొన్ని చిక్కులు పరిష్కారమవుతాయి.
 
కుంభం :- ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. రుణాల కోసం అన్వేషిస్తారు. వ్యాపారాల్లో ఆకర్షణీయమైన పథకాలతో వినియోగదారులను ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులకు శ్రమ పనిభారం అధికమైన మునుముందు సత్ఫలితాలు ఉంటాయి. స్త్రీలు రచనా వ్యాసంగాలు, కళలకు సంబంధించిన పోటీలలో రాణిస్తారు.
 
మీనం :- కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదరుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. పాత రుణాలు తీరుస్తారు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. ఇతరుల గురించి హాస్యానికై మీరు చేసిన వ్యాఖ్యానాల వల్ల ఊహించని సమస్యలు తలెత్తుతాయి. 
About Writer
రామన్
తర్వాతి కథనం
18-02- 2024 నుంచి 24-02-2024 వరకు మీ వార రాశి ఫలితాలు