గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

14-02-2024 బుధవారం దినఫలాలు - గాయిత్రి మాతను ఆరాధించిన శుభం...

gayatri devi
శ్రీ శోభకృత్ నామ సం|| మాఘ శు॥ పంచమి సా.6.17 రేవతి సా.4.38 ఉ.శే.వ.6.53 కు
ప.దు. 11.52 ల 12.37.
గాయిత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది.
 
మేషం :- మీ శక్తి సామర్ధ్యాలు ఎదుటివారిని ఆశ్చర్యపరుస్తాయి. స్త్రీలు కళాత్మక పోటీల్లో రాణిస్తారు. తలపెట్టిన పనులు అర్థాంతంగా ముగిస్తారు. మీ సంతానం కోసం ధనం వ్యయంచేస్తారు. నూతన వ్యక్తుల పరిచయం మీకెంతో సంతృప్తి నిస్తుంది. ఓర్పుతో వ్యవహరించడం వల్ల ఒక సమస్య పరిష్కారమవుతుంది.
 
వృషభం :- సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ఎదుటివారితో మితంగా సంభాషించటం క్షేమదాయకం. పుణ్యక్షేత్రాల దర్శనం వల్లమానసిక ప్రశాంతత చేకూరుతుంది. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల జాగ్రత్త అవసరం. విదేశీయానాలకై చేయు యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.
 
మిథునం :- ఉద్యోగస్తుల సమర్థత, అంకితభావాన్ని అధికారులు గుర్తిస్తారు. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. రుణయత్నాల్లో ఆటంకాలు తొలగిపోగలవు. మీ కళత్ర పట్టుదల, సంతానం మొండి వైఖరి వల్ల చికాకులు తప్పవు. పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. 
 
కర్కాటకం :- దంపతులకు ఏ విషయంలోనూ పొత్తుకుదరదు. వాహనం ఇతరులు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ప్రముఖుల సహకారంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. నిరుద్యోగులు ఉపాధి పథకాల గురించి ఒక అవగాహనకు వస్తారు.
 
సింహం :- డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. వాగ్వివాదాలకు, ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. పాత మిత్రుల నుంచి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుపస్తాయి.
 
కన్య :- మీ ఉత్సాహాని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ప్రముఖుల కలయిక అనుకూలిస్తుంది. ఊహంచని పెద్ద ఖర్చు తగిలే అవకాశంఉంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మందలింపులు తప్పవు.
 
తుల :- బంధువుల మధ్య అపోహలు తొలగిపోయి ఆప్యాయతలు పెరుగుతాయి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. మీ సంతానం విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటంవల్ల అస్వస్థతకు లోనవుతారు. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి.
 
వృశ్చికం :- దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతాయి. ప్రైవేటు సంస్థల్లో వారికి, ఆడిటర్లకి ఒత్తిడి పనిభారం అధికమవుతుంది. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. స్త్రీలకు షాపింగులోను, అపరిచిత వ్యక్తుల విషయంలోను జాగ్రత్తగా ఉండాలి.
 
ధనస్సు :- ఉద్యోగస్తులు యూనియన్ కార్యకలాపాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. బంధుమిత్రుల కలయికతో ఉత్సాహం చోటుచేసుకుంటుంది. మీ అతిథి మర్యాదలు అందరినీ ఆకట్టుకుంటాయి. పారిశ్రామిక రంగాల వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. స్త్రీలకు కళ్ళు, తల,నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి.
 
మకరం :- ఒకానొక విషయంలో మిత్రుల వైఖరి నిరుత్సాహ పరుస్తుంది. రుణయత్నాల్లో ఆటంకాలు తొలగిపోగలవు. దైవ, సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. అత్యవసరమైన సమయంలో కావలసిన పత్రాలు కనిపించకపోవచ్చు. స్త్రీలు కళాత్మక పోటీల్లో రాణిస్తారు. తలపెట్టిన పనులు అర్థాంతంగా ముగిస్తారు.
 
కుంభం :- వాతావరణంలో మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఉత్తరప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. నిరుద్యోగులు గడచిన కాలం గురించి ఆలోచిస్తూ కాలం వృధా చేయకండి. విదేశీ యత్నాలలో కొన్ని అవాంతరాలు ఎదురైనా విజయం సాధిస్తారు. ప్రముఖుల సహకారంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి.
 
మీనం :- ఉద్యోగస్తులకు పదోన్నతి, ఆర్థిక పరమైన ప్రోత్సాహకరమైన వార్తలు వింటారు. మీ కార్య క్రమాలు, ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా వేసుకోవలసివస్తుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి కలిసివచ్చే కాలం. చేపట్టిన పనుల్లో కొంత ముందు వెనుకలుగానైనను సంతృప్తి కానరాగలదు.