బుధవారం, 18 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

11-02-2024 ఆదివారం దినఫలాలు - ఆదిత్య హృదయం చదివిన లేక విన్నా సర్వదా శుభం...

horoscope
శ్రీ శోభకృత్ నామ సం|| మాఘ శు॥ విదియ రా.1.03 శతభిషం రా.9.21 ఉ.శే.వ.7.12 కు తె. వ. 3. 18 ల 4.47. సా.దు. 4.22 ల5.07.
ఆదిత్య హృదయం చదివిన లేక విన్నా సర్వదా శుభం కలుగుతుంది.
 
మేషం :- అనవసపు వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ఉద్యోగ ప్రయత్నం అనుకూలించడంతో మీలో నూతన ఉత్సాహం చోటు చేసుకుంటుంది. స్త్రీలకు తల, మెడ, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. ఫ్యాన్సీ, స్టేషనరీ, రసాయన, సుగంధద్రవ్య వ్యాపారులకు శుభదాయకం.
 
వృషభం :- వృత్తి వ్యాపారస్తులకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఒకానొక విషయంలో మీ కళత్ర మొండివైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం. 
 
మిథునం :- స్త్రీలకు శ్రమాధిక్యత, అకాల భోజనం వంటి చికాకులు తప్పవు. కుటుంబీకులతో కలసి విందు, వినోదాలలో పాల్గొంటారు. స్వయంకృషితోనే మీ పనులు సానుకూలమవుతాయి. వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో రాణిస్తారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖుల కలయిక సాధ్యంకాదు.
 
కర్కాటకం :- మీ చిన్నారుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రిప్రజెంటేటివ్‍లు తమ టార్గెట్లను అతికష్టం మ్మీద పూర్తిచేస్తారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులు, వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. విదేశీయాన యత్నాలు ముమ్మరం చేస్తారు.
 
సింహం :- విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మీ సంతానం అత్యుత్సాహం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
కన్య :- స్త్రీలు ఉత్సాహాని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో నిరుత్సాహం తప్పదు. మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు.
 
తుల :- ఆర్థికంగా ఎదగటానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి రాగలవు. వ్యవసాయ పరికరాలకొనుగోళ్లు చేస్తారు. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి శ్రమాధిక్యత తప్పవు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.
 
వృశ్చికం :- మిత్రుల ఆర్యోగం గురించి ఆందోళన చెందుతారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. స్త్రీలకు ఆహ్వానాలు, వస్త్ర, వస్తులాభం వంటి శుభ ఫలితాలుంటాయి. వాణిజ్య ఒప్పందాలు, భాగస్వామిక చర్చలలో అనుకూలతలుంటాయి. 
 
ధనస్సు :- ఆత్మీయుల కలయికతో మీలో కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారంఉంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ప్రయాణాల్లో మెళకువ వహించండి.
 
మకరం :- మీ సోదరుల తీరు మీకెంతో మనస్తాపం కలిగిస్తుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. మీ కళత్ర మొండివైఖరి ఎంతో చికాకు కలిగిస్తుంది. స్త్రీలు అభిప్రాయాలకు ఆమోదంలభించదు. నిరుద్యోగులు ప్రకటనల పట్ల ఆకర్షితులవుతారు.
 
కుంభం :- మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. వ్యాపారవర్గాలవారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించడం మంచిది. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి.
 
మీనం :- హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిదికాదు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. మీ కుటుంబీకులతో కలసి విందు, వినోదాలలో పాల్గొంటారు.