ఐ|| ద్వాదశి ఉ.11.03 పూర్వాషాఢ రా.2.52 ప.వ. 12.52 ల2.25. పదు. 11. 52 ల 12.37.
మహావిష్ణువును ఆరాధించిన పురోభివృద్ధి పొందుతారు.
మేషం :- ఖర్చులు ఆదాయానికి తగినట్లుగా ఉంటాయి. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం వల్ల శుభం చేకూరగలదు. తలపెట్టిన పనులు వాయిదా పడతాయి.
వృషభం :- కనిపించకుండా పోయిన విలువైన పత్రాలు, రశీదులు తిరిగి లభిస్తాయి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాదు. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు.
మిథునం :- భాగస్వామికులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. చేతివృత్తుల వారికి అవకాశం లభించినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. గృహనిర్మాణం, ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
కర్కాటకం :- స్త్రీలకు షాపింగ్ విషయాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. కుటుంబీకుల మధ్య అవగాహనాలోపం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. కోర్టు వ్యవహరాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు.
సింహం :- ఓర్పు, పట్టుదలతో అనుకున్నపనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆస్తి పంపకాల్లో సోదరుల మధ్య ఏకీభావం నెలకొంటుంది. దైవ, సేవా కార్యక్రమాలకు ఇతోధికంగా సహకరిస్తారు. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. శ్రీవారు, శ్రీమతి విషయాలలో శుభపరిణామాలు సంభవం.
కన్య :- ఆర్థికస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. కళలు, రాజకీయ, ప్రజాసంబంధాల రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. కొబ్బరి, పండ్ల, పూల, తినుబండారాల వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. స్త్రీలు అయిన వారి నుంచి ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. అనుకున్న పనులు ఆశించినంత చురుకుగాసాగవు.
తుల :- ఉద్యోగస్తుల బదిలీ యత్నాలకు కొంతమంది ఆటంకాలు కలిగిస్తారు. ఆత్మీయుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. మీడియా రంగాల వారు పనిభారం, ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. స్థిరాస్తుల అమ్మకానికై చేయుయత్నాలు వాయిదా పడటం మంచిది. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహంలభిస్తాయి.
వృశ్చికం :- ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. ఏజెంట్లు, బ్రోకర్లు, క్యాటరింగ్ పనివారలకు సామాన్యంగా ఉంటుంది. స్త్రీలకు కాళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. భాగస్వామిక చర్చలు ప్రశాంతంగా ముగుస్తాయి. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా ఖర్చు చేస్తారు.
ధనస్సు :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఆత్మీయుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. స్త్రీల ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను తెచ్చుకోకండి. సోదరి, సోదరులతో పరస్పర అవగాహన లోపం తలెత్తవచ్చు. గతస్మృతులు జప్తికిరాగలవు.
మకరం :- ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ రంగాల వారితో సమన్యయం లోపిస్తుంది. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఒక వ్యవహారం నిమిత్తం బాగా శ్రమించాల్సి ఉంటుంది. స్త్రీలకు వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. విదేశీ వస్తువులపట్ల ఆకర్షితులవుతారు.
కుంభం :- మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. స్త్రీలకు పనిభారం అధికం కావడంతో ఆరోగ్యపరమైన సమస్యలు వంటివి ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం నుండి సమస్యలు తలెత్తుతాయి. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు అధికమవుతాయి.
మీనం :- స్త్రీల సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీ పై మంచి ప్రభావం చూపుతాయి. ధన వ్యయం విపరీతంగా ఉన్నా సార్థకత ఉంటుంది. పారిశ్రామిక రంగంలోని వారికి కార్మికులతో సమస్యలు తలెత్తుతాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు.