ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

06-02-2024 మంగళవారం దినఫలాలు - కార్తీకేయుడిని పూజించినా మీ మనోవాంఛలు...

horoscope
శ్రీ శోభకృత్ నామ సం|| పుష్య ఐ|| ఏకాదశి ప.12.06 మూల తె. 3.32 ప.వ.11.43 ల 1.18 రా.వ. 1.57 ల 3. 32. ఉ.దు.8.50ల 9.35 రా.దు 10.57 ల 11.48.
కార్తీకేయుడిని పూజించినా మీ మనోవాంఛలు నెరవేరుతాయి.
 
మేషం :- ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా దుబారా ఖర్చులను అదుపులో ఉంచుకోవటం మంచిది. దైవదర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవటం మంచిది.
 
వృషభం :- ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. ఎదురయ్యే ప్రతి విషయంలో ఫలితాలు సామాన్యంగా ఉంటాయి. గృహోపకరణాలు అమర్చుకుంటారు. స్నేహితులు మీ జీవితానికి మూలస్తంభాలుగా మారతారు. భాగస్వామ్య వ్యాపారాల విషయంలో ఏకాగ్రత, పెద్దల సలహా పాటించడం క్షేమదాయకం.
 
మిథునం :- నిర్మాణ పనులు, మరమ్మత్తులలో ఏకాగ్రత వహించండి. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. బంధువులను కలుసుకుంటారు. దంపతుల మధ్య కలహాలు తలెత్తినా తాత్కాలికమేనని గమనించండి. ఋణవిముక్తులు కావడంతో మానసికంగా కుదుటపడతారు.
 
కర్కాటకం :- ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ వ్యక్తిగత విషయాలు గోప్యంగా ఉంచండి. రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. స్త్రీలు ఆదాయంపై, ధన సంపాదనపై మరింత దృష్టిపెడతారు.
 
సింహం :- పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. ప్రముఖుల కలయికతో కొన్ని పనులు సానుకూలమవుతాయి. మీ యత్నాలకు కుటుంబీకులు సహాయ, సహకారాలు అందిస్తారు. స్త్రీల కళాత్మతకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు.
 
కన్య :- మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా ఖర్చు చేస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి పని భారం అధికమవుతుంది. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. శతృవులపై విజయం సాధిస్తారు. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది.
 
తుల :- ఆలయాలను సందర్శిస్తారు. ఆకస్మిక ఖర్చులు మీ ఆర్థికస్థితికి ఆటంకంగా నిలుస్తాయి. ప్లీడర్లకు ఒత్తిడి, అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి. మీ ఆశయ సాధనకు నిరంతర కృషి అవసరం అని గమనించండి. ధనం ఏ కొంతైనా పొదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరదు.
 
వృశ్చికం :- డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. స్త్రీలకు సంతానం, పనివారలతో ఊహించని సమస్యలు తలెత్తుతాయి. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి.
 
ధనస్సు :- వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్థులు అధిక ఒత్తిడిని, ఇబ్బందులను ఎదుర్కొంటారు. బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. విద్యార్థులు విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహించిన  సత్ఫలితాలు పొందగలరు. 
 
మకరం :- ఆదాయ, వ్యయాల విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. మీ తల్లి, తండ్రి పేరుతో దానధర్మాలు చేయడంవల్ల మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. ఇతరుల గురించి హాస్యానికై మీరు చేసిన వ్యాఖ్యానాల వల్ల ఊహించని సమస్యలు తలెత్తుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.
 
కుంభం :- మీ కళత్ర మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. రాజకీయాలలో వారికి రహస్యపు విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. మిత్రుల కలయికతో మనసుకుదుటపడుతుంది. టెక్నికల్, స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాలలో వారికి లాభదాయకం.
 
మీనం :- ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. స్థిరాస్తుల అమ్మకానికై చేయుయత్నాలు వాయిదా పడటం మంచిది. నూతన ఒప్పందాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులు తరచూ సభలు, సమావేశాలలో పాల్గొంటారు. కుటుంబ అవసరాలు పెరగడంతో అదనపు సంపాదన దిశగా ఆలోచనలు చేస్తారు.