ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

09-02-2024 శుక్రవారం దినఫలాలు - లక్ష్మీదేవిని పూజించి, అర్చించిన శుభం...

rashiphal
శ్రీ శోభకృత్ నామ సం|| పుష్య ఐ॥ చతుర్ధశి ఉ.7.48 అమావాస్య తె.5.42 శ్రవణం రా.12.31 ఉ.శే.వ.7.07 కు తె.వ.4.16 ల 5.46. ఉ.దు.8.50ల 9.35 ప.దు. 12.36 ల 1.21. లక్ష్మీదేవిని పూజించి, అర్చించిన శుభం కలుగుతుంది.
 
మేషం :- వ్యాపార, ఆర్థికాభివృద్ధికి చేయుకృషిలో ఆశాజనకమైన మార్పులు ఉంటాయి. పెరిగే ఖర్చులు, అవసరాలు మీ రాబడికి మించటంతో ఆందోళన, నిరుత్సాహం అధికమవుతాయి. ఊహించని వ్యక్తుల నుంచి అందిన సమాచారం మీకు బాగా ఉపకరిస్తుంది. చేసే పనిలోఏకాగ్రత, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. 
 
వృషభం :- గృహం ఏర్పరచుకోవాలనే కోరిక నెరవేరుతుంది. బంగారు, వాహనం ఇత్యాది విలువైన వస్తువులు అమర్చుకుంటారు. ఖర్చులు అధికమవుతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు సమర్ధంగా ఎదుర్కొంటారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండి లక్ష్య సాధనకు మరింతగా కృషి చేయవలసి ఉంటుంది. 
 
మిథునం :- సాంఘిక, శుభకార్యాలలో వీరు మంచి గుర్తింపు పొందుతారు. తోటివారి సహకారంతో వీరు పరీక్షల్లో సామాన్య ఫలితాలు సాధిస్తారు. గృహంలో మార్పులు వాయిదా పడతాయి. మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంతో ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. మీ సంతానం మొండి వైఖరి వల్ల చికాకులుతప్పవు. 
 
కర్కాటకం :- స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెళకువ అవసరం. స్త్రీలకు అధిక శ్రమ, ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమాధిక్యత, చికాకులు తప్పవు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవటం మంచిది.
 
సింహం :- ఆకస్మిక ఖర్చుల వల్ల ఒకింత ఒడిదుడుకులు తప్పవు. మిత్రుల ద్వారా అందిన ఒక సమాచారంతో మీలో కొత్త ఆలోచనలు చోటుచేసుకుంటాయి. విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది. గతానుభవాలు జ్ఞప్తికి రాగలవు. మీ సంతానం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి.
 
కన్య :- దైవ, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బ్యాంకు పనులు అనుకూలం. రావలసినధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. కాంట్రాక్టర్లు పనివారి వల్ల సమస్యలకు, ఇబ్బందికి లోనవుతారు. ప్రేమికుల తొందరపాటుతనం సమస్యలు దారితీస్తుంది. చేతివృత్తుల వారికి శ్రమాధిక్యత, ఒత్తిడి అధికమవుతాయి.
 
తుల :- స్త్రీలు వాగ్విదాలకు దూరంగా ఉండటం మంచిది. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. మీ అభిప్రాయాల వ్యక్తీకరణకు సందర్భం కలిసివస్తుంది. పోస్టల్, ఎల్.ఐ.సి ఏజెంట్లకు శ్రమ, త్రిప్పట అధికం. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటంమంచిది. స్థిరాస్తి అమ్మకం విషయంలో పునరాలోచన అవసరం.
 
వృశ్చికం :- విద్యార్థులకు ప్రేమవ్యవహారాల్లో భంగపాటు తప్పదు. ఖర్చులు భారీగానే ఉంటాయి, ధనం కూడా విరివిగా వ్యయం చేస్తారు. లిటిగేషన్ వ్యవహారాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు షాపుల మార్పిడికి అనుకూలం. ధనమూలక సమస్యలు ఒక కొలిక్కివస్తాయి. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు.
 
ధనస్సు :- ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. వృత్తి ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. మీపై శకునాలు, ఇతరుల వ్యాఖ్యల ప్రభావం అధికం. పత్రికా సిబ్బందికి ఏకాగ్రత ప్రధానం. విద్యార్థుల్లో ఏకాగ్రత, మనోధైర్యం నెలకొంటాయి. దంపతుల మధ్య బంధువుల ప్రస్తావన వస్తుంది.
 
మకరం :- ఐరన్, సిమెంటు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు ఎప్పటి నుండో వాయిదా పడుతున్న పనులు అనుకోకుండా పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు అధికారులతో సమస్యలు, రావలసినధనం వాయిదా పడుతుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
 
కుంభం :- కిరణా, ఫ్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారులకు కలిసిరాగలదు. స్త్రీల తొందరపాటుతనానికి ఊహించని చికాకులు తలెత్తవచ్చు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి చికాకు తప్పదు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు ఎదుర్కుంటారు. సోదరీ సోదరుల మధ్య పరస్పర అవగాహన కుదరదు.
 
మీనం :- చేపట్టిన పనులలో స్వల్ప ఒడిదుడుకులు ఎదురైనా పట్టుదలతో శ్రమించి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉపాధ్యాయులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దైవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఏ విషయంలోనూ మొహమాటాలకు పోకుండా మీ నిర్ణయం ఖచ్చితంగా తెలియజేయటం శ్రేయస్కరం.