శ్రీ శోభకృత్ నామ సం|| ఆశ్వీయుజ శు॥ అష్టమి సా.5.21 ఉత్తరాషాఢ సా. 5.13 రా.వ.8.58 ల 10.28. సా.దు.4.12 ల 5.00.
ఆదిత్యుని పూజించిన శుభం, జయం, పురోభివృద్ధి కానవస్తుంది.
మేషం :- బంధు మిత్రులతో కలసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగసులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ధనం సకాలంలో అందక నిరుత్సాహం చెందుతారు. మీరు చేసే కృషి వల్ల మీ ప్రతిభ వెలుగులోనికి వచ్చి మంచి విజయం సాధిస్తారు.
వృషభం :- పండ్ల, పూల, కొబ్బరి వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళకువ అవసరం. దైవ, సేవా కార్యక్రమాలకు దానధర్మాలు చేయటం వల్ల మీ కీర్తి, ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి అధికమవుతుంది. పెద్దల ఆరోగ్యము కుదుటపడుతుంది.
మిథునం :- ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. దంపతుల మధ్య పరస్పర అవగాహనకుదరదు. మీ గౌరవ మర్యాదలకు భంగం కలుగకుండా వ్యవహరించండి. ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది. పుణ్యక్షేత్రాలను దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
కర్కాటకం :- బంధువుల రాకతో అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ప్రముఖులతో పరిచయాలు అధికమవుతాయి. మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి.
సింహం :- బంధువుల రాక వల్ల తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు. మీ మంచి కోరుకొనేవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. మీ నిర్లక్ష్యంవల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు.
కన్య :- పిల్లల కోసం, ప్రియతముల కోసం అధికంగా ఖర్చు చేస్తారు. మీ ఆవేశం, అవివేకం వల్ల వ్యవహారం చెడే ఆస్కారం ఉంది. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. రేపటి గురించి అధికంగా ఆలోచిస్తారు. కళాకారులకు, రచయితలకు పత్రికా రంగాలలో వారికి అనుకూలమైన కాలం. హోటల్ వారికి పనిభారం అధికమవుతుంది.
తుల :- ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. పాతమిత్రుల కలయికతో గత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. పెద్దలతో ఏకీభవించలేకపోతారు. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండండి. నిరుద్యోగులు ఒక ప్రకటనపట్ల ఆకర్షితులవుతారు. మిమ్మల్ని పొగిడే వారి పట్ల అప్రమత్తంగా మెలగండి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.
వృశ్చికం :- మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. మీ శ్రీమతిలో వచ్చిన మార్పు సంతృప్తినిస్తుంది. స్నేహ బృందాలు అధికం అవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుటుంబీకులతో ఆనందంగా గడుపుతారు. ఒకవేడుకను ఘనంగా చేయటానికి సన్నాహాలు మొదలెడతారు.
ధనస్సు :- ఫ్యాన్సీ, కిరణా, మందుల వ్యాపారస్తులకు లాభదాయకం. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటవచ్చును. రాజకీయనాయకులకు ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. మీసంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
మకరం :- మనుషుల మనస్తత్వం తెలిసి మసలుకొనుట మంచిది. స్త్రీలు ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. బంధువుల రాకతో వస్త్రా, విలువైన వస్తువుల కొనుగోళ్ళ నిమిత్తం ధనం విరివిగా వ్యయం చేస్తారు. పెద్దల ఆహార, ఆరోగ్య విషయాలలో మెళకువ అవసరం.
కుంభం :- చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. మిత్రుల రాక సంతోషం కలిగిస్తుంది. ముఖ్యమైన విషయాలను గురించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్లు విడిపించుకుంటారు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు.
మీనం :- మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. విద్యార్థులు ఇతురుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడివల్ల ఆందోళనలకు గురవుతారు. రావలసిన ధనం చేతికందుతుంది. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు.