సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

19-10-2023 గురువారం రాశిఫలాలు - అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం....

astrolgy
శ్రీ శోభకృత్ నామ సం|| ఆశ్వీయుజ శు॥ పంచమి రా.10.27 జ్యేష్ఠ రా.8.09 తె.వ.3.56 ల 5.29. ఉ.దు. 9.50 ల 10.38 ప.దు. 2.35ల 3.22.
అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసిన సర్వదా శుభం.
 
మేషం :- కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. కీలకమైన వ్యవహారాల్లో మీరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. విద్యుత్ రంగంలో వారు మాటపడక తప్పదు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం.
 
వృషభం :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. స్త్రీల ప్రతిభకు గుర్తింపు, సదావకాశాలు లభిస్తాయి. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలు కలిసిరాగలదు. బంధువులకు ఆర్థికసాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం.
 
మిథునం :- బంధువులతో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. స్థిరాస్తుల కొనుగోళ్ళపై దృష్టి సారిస్తారు. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. వ్యాపార, ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు.
 
కర్కాటకం :- మీ పాత సమస్యలు పరిష్కారం కాకపోవడంలో కొంత నిరుత్సాహనికి గురవుతారు. ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకుపురోభివృద్ధి. బ్యాంకు వ్యవహారాలు, చెక్కుల జారీలో ఏకాగ్రత అవసరం. ఆకస్మిక మిత్రుల కలయిక మీకు ఎంతో సంతృప్తినిస్తుంది.
 
సింహం :- పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఒక దైవకార్యం ఘనంగా చేయాలనే ఆలోచనస్ఫురిస్తుంది. ఉద్యోగస్తులకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. కార్యసాధనలో ఓర్పు, పట్టుదల ముఖ్యమని గమనించండి. ప్రముఖులను కలుసుకుంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూ లేఖలు అందుకుంటారు.
 
కన్య :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. సభలు, సమావేశాల్లో మీ అలవాట్లు, వ్యసనాలు అదుపులో ఉంచుకోవటం క్షేమదాయకం. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి.
 
తుల :- నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ప్రేమికులు అతిగా వ్యవహరించటం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. రావలసిన ధనం సమయానికి అందుకుంటారు. చిన్నతరహా పరిశ్రమలు, వృత్తుల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు. ప్రైవేటు సంస్థలోని వారికి ఓర్పు, ఏకాగ్రత అవసరం.
 
వృశ్చికం :- ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. విద్యార్థినుల ఆలోచనలు పక్కదారి పట్టే ఆస్కారం ఉంది. సంగీత కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్థిస్తారు.
 
ధనస్సు :- బ్యాంకు వ్యవహారాలలో మెళకువ అవసరం. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఆశాభంగం. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఊహించని ఖర్చుల వల్ల ఆటుపోట్లు, చికాకులు ఎదుర్కుంటారు.
 
మకరం :- ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం గమనించండి. దంపతుల మధ్య చిన్న చిన్న అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. దైవ, పుణ్య కార్యాలకు విరివిగా ధనం వ్యయం చేస్తారు. కోర్టు పనులు మందకొడిగా సాగుతాయి. రాజకీయాలలో వారికి అవకాశవాదులు అధికం అవుతున్నారని గమనించండి. ఖర్చులు అధికమవుతాయి.
 
కుంభం :- బంధువుల రాక వల్ల తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు. మీ మంచి కోరుకొనేవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు.
 
మీనం :- వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. నగదు చెల్లింపుల్లో తొందరపడవద్దు. స్త్రీలకు టీ.వీ చానెళ్ల కార్యక్రమంలో అవకాశం లభిస్తుంది. ఉమ్మడి వ్యాపారాలు, నూతన పెట్టుబడుల ఆలోచన వాయిదా వేయండి. మీకు ఆందోళన కలిగించిన సమస్య తేలికగా సమసిపోతుంది.