మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : బుధవారం, 29 మే 2024 (09:37 IST)

29-05-202 బుధవారం దినఫలాలు - ప్రేమ వ్యవహారాల్లో తొందరపాటుతనం కూడదు...

Weekly astrology
శ్రీ క్రోధినామ సం|| వైశాఖ ఐ| షష్టి ప.1.16 శ్రవణం ఉ.8.40 ప.వ.12.26 ల 1.57. ప.దు. 11.31 ల 12.22.
 
మేషం :- ఉద్యోగస్తులు కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. ధనసహాయం, హామీలకు సంబంధించిన విషయాల్లో పునరాలోచన అవసరం. తలపెట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఏకాగ్రత ముఖ్యం.
 
వృషభం :- కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ విభాగం నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. స్త్రీలకు పనివారలతో చికాకులు, ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రయాణాలు వాయిదాపడతాయి. రిప్రజెంటేటివ్‌లకు, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది.
 
మిథునం :- వ్యాపారాభివృద్ధికి కావలసిన ప్రణాళికలు అమలు చేస్తారు. మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. ప్రింటింగ్ రంగంలోని వారికి అచ్చు తప్పులు దొర్లుట వల్ల పై అధికారుల చేత మాటపడక తప్పదు. స్త్రీలు షాపింగ్ వ్యవహారాలు, నూతన పరిచయస్తులతో అప్రమత్తత అవసరం.
 
కర్కాటకం :- బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి గురవుతారు. బ్యాంకు వ్యవహారాలు పనిభారం వల్ల చికాకు కలిగిస్తాయి. సమయానికి సహకరించని మిత్రుల తీరు నిరుత్సాహపరుస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో తొందరపాటుతనం కూడదు. రుణాల కోసం అన్వేషిస్తారు. వాహనచోదకులకు ఏకాగ్రత అవసరం.
 
సింహం :- దంపతుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. గృహ మరమ్మతులు, మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. రాజకీయ కళా రంగాల వారికి విదేశీ పర్యటనలు. మీ ఔదార్యాన్ని కొంతమంది దుర్వినియోగం చేసే అవకాసం ఉంది. జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు అధికారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది.
 
కన్య :- ఉద్యోగస్తులు పై అధికారులు నుంచి ఒత్తిడి అధికమవుతుంది. ధనవ్యయం, ధనసహాయం విషయంలో ఏకాగ్రత వహించండి. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. స్త్రీల అంతరంగిక వ్యవహారాలు బయటకు వ్యక్తం చేయటం వల్ల ఇబ్బందులు తప్పవు. సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.
 
తుల :- రాబడికి తగ్గ వ్యయం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. ఖర్చులు అధికమవుతాయి. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవటం ఎంతైనా అవసరం. దంపతుల మధ్య కలహాలు తలెత్తుతాయి. రాజకీయ నాయకులు సభా సమావేశాలలో పాల్గొంటారు. ఇంటికి అవసరమైన వస్తువులు సమకూర్చుకుంటారు.
 
వృశ్చికం :- బంధువర్గాల నుంచి విమర్శలు మాటపట్టింపులు ఎదురయ్యే అవకాశం ఉంది మెళకువ వహించండి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలనివ్వగలవు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రత్యర్థుల సైతం వీరి ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. పెద్దల ఆరోగ్యములో అధికమైన జాగ్రత్తలు అసవరం.
 
ధనస్సు :- గృహనిర్మాణాలు, మరమ్మతులలో జాప్యం, వ్యయం మీ అంచనాలను మించుతాయి. ఆదాయం పెంచుకునేందుకు చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. స్త్రీలకు ఉదరం, మోకాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు శుభదాయకంగా ఉంటుంది.
 
మకరం :- ప్రతి విషయంలోనూ పెద్దలతో సంప్రదింపులు చేయుట మంచిది. ఇతరులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలో లౌక్యం అవసరం. స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్యక్రమాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. నిరుద్యోగలు చేపట్టిన ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది. మొండి బాకీలు వసూలు కాగలవు.
 
కుంభం :- ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి కలిసివచ్చేకాలం. ఓ మంచి వ్యక్తి అభిమానాన్ని పొందుతారు. నిరుద్యోగుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఉద్యోగస్తులకు తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. రచయితలకు పత్రికా రంగాల వారికి చికాకులుతప్పవు. 
 
మీనం :- దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గతంలో నిలిపి వేసిన వ్యాపారాలు, పనులు పునఃప్రారంభించటానికి చేసే యత్నాలు ఫలిస్తాయి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిర్మాణ పనులలో జాప్యం, అధిక వ్యయం వల్ల ఆందోళనకు గురవుతారు.