04-10-2026 నుండి 10-10-2026 వరకు వారఫలాలు - శుభలేఖ అందుకుంటారు
Weekly horoscope
అన్ని విధాలా అనుకూలదాయకం. లక్ష్యాన్ని సాధిస్తారు. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. కొత్త యత్నాలు చేపడతారు. అవకాశాలు కలిసివస్తాయి. ఉత్సాహంగా గడుపుతారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. పనులు, కార్యక్రమాలు స్వయంగా చూసుకోండి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఖర్చులు భారమనిపించవు. ఆదివారం నాడు అపరిచితులతో జాగ్రత్త, ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంస్థల స్థాపనకు అనుకూలం. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉపాధి పథకాలలో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తుల కార్యకలాపాలు యథావిధిగా సాగుతాయి. ఆహ్వానం అందుకుంటారు.
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఏ విషయంపైనా ఆసక్తి ఉండదు. చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. మీపై గ్రహాల ప్రభావం అధికం. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ముఖ్యమైన చెల్లింపుల్లో జాప్యం తగదు. మంగళవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. కొన్ని విషయాలను చూసీచూడనట్లు వదిలేయండి. భార్యాభర్తల మధ్య అకారణ కలహం. బంధుమిత్రులతో పట్టింపులు ఎదుర్కుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఏ విషయాన్నీ సమస్యగా అనుకోవద్దు. త్వరలో పరిస్థితులు మెరుగుపడతాయి. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. ఉపాధి పథకాలు అంతంతమాత్రంగా సాగుతాయి. వృత్తుల వారికి సామాన్యం. ఆశావహ దృక్పథంతో మెలగండి. దైవదర్శనాల్లో అవస్థలు ఎదుర్కుంటారు.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యసిద్ధికి నిర్విరామంగా శ్రమిస్తారు. అవకాశాలు అందినట్లే చేజారిపోతాయి, ఓర్పుతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. బుధవారం నాడు పెద్దమొత్తంలో నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త, మీ పక్కనే మోసగాళ్లు ఉంటారని గమనించండి. శుభలేఖ అందుకుంటారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. మానసికంగా స్థిమితపడతారు. సంతానం కదలికలపై కన్నేసి ఉంచండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారుల తీరుకు అనుగుణంగా మెలగండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహార జయం, ధనలాభం ఉన్నాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. పొదుపునకు అవకాశం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు జరుగుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. దాంపత్య సౌఖ్యం పొందుతారు. శుక్రవారం నాడు మధ్యవర్తిత్వాలు, హామీలు తగదు. మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియజేయండి. సంస్థల స్థాపనలకు అనుకూలం. తెగిపోయిన స్నేహసంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. చిన్ననాటి ఉపాధ్యాయులను కలుసుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఫర్వాలేదనిపిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలు సరిదిద్దుకుంటారు. ప్రైవేటు ఉద్యోగస్తులకు పనిభారం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రయాణంలో జాగ్రత్త.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ వారం అన్ని విధాలా అనుకూలదాయకం. గత కొంత కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి విముక్తులవుతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. కొంతమొత్తం పొదుపు చేయగలుగుతారు. ధనసహాయం చేయడం తగదు. మీ ఇబ్బందులను లౌక్యంగా తెలియజేయండి. ఎవరినీ నొప్పించవద్దు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆప్తుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు అనుకూలమవుతాయి. మధ్యవర్తిత్వాలు, హామీల జోలికి పోవద్దు. కొన్ని విషయాలను చూసీచూడనట్లు వదిలేయండి. ఆహ్వానం అందుకుంటారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. పెట్టుబడులకు అనుకూలం. వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. అధికారులకు స్థానచలనం, ఉద్యోగస్తులకు పనిభారం.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. విమర్శలు, వ్యాఖ్యలను పట్టించుకోవద్దు. చేపట్టిన పనులు ఆలస్యంగానైనా పూర్తిచేస్తారు. మొండి బాకీలు వసూలు కావు. ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపుధనం ముందుగానే ఖర్చవుతుంది. నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. పత్రాల్లో సవరణలు సాధ్యపడవు, మరోసారి యత్నించండి. సన్నిహితుల ప్రోత్సాహంతో అడుగు ముందుకేస్తారు. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. తొందరపడి హామీలు ఇవ్వవద్దు. అవతలి వారి స్తోమతను క్షుణ్ణంగా తెలుసుకోండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. బెట్టింగులకు పాల్పడవద్దు.
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. మీ మాటకు సర్వత్రా ఆమోదం లభిస్తుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. వాహనం కొనుగోలు చేయాలనే కోరిక నెరవేరుతుంది. సోమవారం నాడు పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఇతరులపై ఆధారపడవద్దు. భార్యాభర్తల మధ్య అవగాహన నెలకొంటుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. దైవదర్శనాల్లో అవస్థలు ఎదుర్కుంటారు.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు
ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. రుణ సమస్య తొలగుతుంది. ప్రతి విషయంలోనూ ధైర్యంగా ముందుకు అడుగు వేస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. శనివారం నాడు పనులు ఒక పట్టాన సాగవు. చిన్న విషయానికే చికాకుపడతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వీలైనంత వరకు ఆప్తులతో కాలక్షేపం చేయండి. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులు, కన్సల్టెన్సీలను అతిగా నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. సంతానానికి ఉన్నత ఉద్యోగం లభిస్తుంది. ప్రైవేటు ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు యథావిధిగా సాగుతాయి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం
వ్యవహార లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఆచితూచి అడుగేయాల్సిన సమయం, అనుభవజ్ఞులను సంప్రదించండి. మీ నిర్ణయాన్ని వాయిదా వేయడం శ్రేయస్కరం. భార్యాభర్తల మధ్య అకారణ కలహం. సామరస్యంగా మెలగండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. శుభలేఖ అందుకుంటారు. తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం కదలికలపై దృష్టిపెట్టండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఆత్మీయులతో తరచు సంభాషిస్తుంటారు. ఒక సమాచారం ఉత్తేజం కలిగిస్తుంది. కొత్త యత్నాలు చేపడతారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. హోల్‌సేల్ వ్యాపారాల్లో నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. ఉద్యోగ బాధ్యతల పట్ల శ్రద్ధ వహించండి. వేడుకకు హాజరవుతారు.
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు
అన్ని రంగాల వారికీ యోగదాయకమే. స్థిరచరాస్తుల ద్వారా ధనం అందుతుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. పనులు వేగవంతమవుతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. సభ్యత్వాలు, పదవుల స్వీకరణకు అనుకూలం. అందరితోనూ కలుపుగోలుగా మెలగండి, బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. శుక్రవారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు యథావిధిగా సాగుతాయి. వృత్తుల వారికి బాగుంటుంది. ప్రయాణం తలపెడతారు.
కుంభం: ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
పరిస్థితులు కొంతమేరకు చక్కబడతాయి. లక్ష్యానికి చేరువవుతారు. యత్నాలు విరమించుకోవద్దు. పట్టుదలతోనే కార్యం సిద్ధిస్తుంది. ఆదాయం సంతృప్తికరం. రుణవిముక్తులవుతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి. బుధవారం నాడు ముఖ్యుల కలయిక సాధ్యపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మీ శ్రీమతి ప్రోద్బలంతో ముందుకు సాగుతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. నిశ్చితార్థంలో జాగ్రత్త. సాధ్యం కాని హామీలు ఇవ్వవద్దు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు హోదా మార్పు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వృత్తి, ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వేడుకకు హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి.
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
అన్ని విధాలా కలిసివచ్చే సమయం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సలహాలు, సాయం ఆశించవద్దు, కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సంయమనం పాటించండి. విమర్శించిన వారే మీ సమర్థతను గుర్తిస్తారు. పనుల్లో శ్రమ, చికాకులు అధికం. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. చెల్లింపుల్లో జాప్యం తగదు. శనివారం నాడు అప్రియమైన వార్త వింటారు. కార్యక్రమాలు ముందుకు సాగవు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వండి. గృహమార్పు అనివార్యం. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త. ఆప్తులతో తరచు సంభాషిస్తుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి.
