1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. 3-Day Bank Strike From Tomorrow: What Banking Services Will Stop And What Will Continue?

రేపటి నుంచి బ్యాంకుల సమ్మె - స్తంభించే సేవలు ఇవే...

bank strike
దేశ వ్యాప్తంగా సోమవారం నుంచి మూడు రోజుల పాటు బ్యాంకు సేవలు స్తంభించనున్నాయి. ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అన్ని ప్రభుత్వం రంగ బ్యాంకులు మూతపడనున్నాయి. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు సిబ్బంది మూడు రోజుల పాటు సమ్మెకు దిగుతున్నారు. దీంతో సెప్టెంబరు 28 నుంచి 30వ తేదీ వరకు బ్యాంకుల్లో అన్ని రకాల సేవలకు అంతరాయం కలుగనుంది. 
 
వారానికి ఐదు రోజుల పనిదినాలను అమలు చేయాలన్నది బ్యాంకు యూనియన్ల ప్రధాన డిమాండ్‌గా ఉంది. దీంతో పాటు పెన్షన్ ప్రయోజనాల్లో మార్పులు, ఇతర సర్వీస్ సంబంధిత సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ఈ డిమాండ్ల సాధన కోసమే సమ్మెకు బ్యాంకు ఉద్యోగులు పిలుపునిచ్చారు. ఈ సమ్మెలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ప్రధానంగా పాల్గొంటున్నాయి. దీంతో అనేక రకాలైన సేవలు స్తంభించనున్నాయి. 
 
రానున్న మూడు రోజుల పాటు బ్రాంచ్‍‌లలో నగదు డిపాజిట్లు, విత్ డ్రాలు, పాస్ బుక్ అప్‌డేట్, ప్రింటింగ్, చెక్ క్లియరింగ్, ఇతర చెక్ సంబంధిత లావాదేవీల్లో జాప్యం, కొత్త డిమాండ్ ట్రాఫ్టుల జారీ, కేవైసీ, అకౌంట్ వివరాల మార్పులు వంటి పనులు, లోన్ దరఖాస్తులు, డాక్యుమెంటేషన్, వెరిఫికేషన్ ప్రక్రియలు, బ్యాంకు లాకర్ సేవలు పూర్తిగా స్తంభించనున్నాయి.
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ : ప్రధాని మోడీ హెచ్చరిక