1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Amul Company increased 2rs on Milk Products

పాల ధరలను పెంచిన అమూల్ సంస్థ

Amul Company
ప్రముఖ పాల ఉత్ప‌త్తుల సంస్థ‌ అమూల్ మహాశివరాత్రి సందర్భంగా అమూల్ తన వినియోగదారులకు ఒక‌రోజు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేసింది. పనిలో పనిగా తమ కస్టమర్లకు అమూల్ షాకిచ్చింది. అమూల్ పాల ధరను లీటరుకు 2 రూపాయలు పెంచుతున్నట్లు అమూల్ ప్రకటించింది. 
 
అమూల్ గోల్డ్ పాల ధర అరలీటర్ రూ.30 అవుతుంది. అలాగే అమూల్ అరలీటర్ పాల ధర రూ. 24, అమూల్ శక్తి 500 ఎంఎల్‌ రూ. 27కు అందుబాటులో ఉంటాయి. 
 
అమూల్ సంస్థ‌ దాదాపు 7 నెలల 27 రోజుల విరామం తర్వాత పాల ధరను పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. చివరిగా జూలై, 2021 నెలలో రూ. లీటరుకు 2 పెంచింది.
తర్వాతి కథనం
శివరాత్రి సంగీత మహోత్సవాలు ప్రారంభం