బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (18:15 IST)

శివరాత్రి సంగీత మహోత్సవాలు ప్రారంభం

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మూడు రోజుల పాటు సంగీత‌, నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. తిరుపతిలోని ఎస్వీ సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాద‌స్వర‌, డోలు పాఠ‌శాల ఆధ్వర్యంలో సోమ‌వారం తిరుప‌తిలోని మహతి కళాక్షేత్రంలో ఈ శివరాత్రి సంగీత మహోత్సవాలు ప్రారంభ‌మ‌య్యాయి. 
 
ఎస్వీ నాద‌స్వరం డోలు పాఠ‌శాల విద్యార్థులు మంగ‌ళ‌క‌రంగా నాద‌స్వరం, డోలు వాయిద్య సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మోహ‌న‌కృష్ణ‌, ప‌వ‌న్‌కుమార్‌, రూపేశ్‌ అనే విద్యార్థులు భ‌క్తిగీతాల‌ను ఆలపించారు.