1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Bondbazaar Appoints Industry Veteran S. Sambath Kumar as Chief Executive Officer

బాండ్‌బజార్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎంపికైన పరిశ్రమ నిపుణులు ఎస్‌. శంభత్‌ కుమార్‌

Sambath Kumar
ముంబై: భారత్‌కు చెందిన సాంకేతిక ఆధారిత ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ పెట్టుబడుల వేదిక బాండ్‌బజార్‌ సంస్థ నూతన చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(సీఈఓ)గా ఎస్‌. శంభత్‌ కుమార్‌ను నియమించింది. సంస్థ తదుపరి దశ వృద్ధికి ఆయన నేతృత్వం వహించనున్నారు. డిజిటల్‌ పెట్టుబడుల వ్యవస్థను బలోపేతం చేయడం, పంపిణీ నెట్‌వర్క్‌ను విస్తరించడం, దేశవ్యాప్తంగా రిటైల్‌ మదుపరులకు ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ పెట్టుబడులను మరింత అందుబాటులోకి తీసుకురావడంపై ఆయన దృష్టి సారించనున్నారు.
 
శంభత్‌ కుమార్‌కు ఆర్థిక సేవలు, వ్యాపార అభివృద్ధి, ఉత్పత్తుల వ్యూహరచన, పంపిణీ రంగాల్లో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌లో చీఫ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. అంతకుముందు రిలయన్స్‌ క్యాపిటల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌లో సెగ్మెంట్‌ హెడ్‌-బిజినెస్‌ డెవలప్‌మెంట్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. స్పార్క్‌ క్యాపిటల్‌తోనూ ఆయనకు అనుబంధం ఉంది.
 
తన నియామకంపై ఎస్‌. శంభత్‌ కుమార్‌ మాట్లాడుతూ, ‘‘కీలక దశ వృద్ధిలో ఉన్న బాండ్‌బజార్‌లో చేరడం ఆనందంగా ఉంది. భారత్‌లో ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ మార్కెట్‌లో రిటైల్‌ మదుపరుల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు గణనీయమైన అవకాశాలున్నాయి. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించనుంది. పెట్టుబడిదారులకు దేశవ్యాప్తంగా సులభమైన, పారదర్శకమైన, విశ్వసనీయమైన పెట్టుబడి అనుభవాన్ని అందించేందుకు వేదికను బలోపేతం చేయడం, మా సేవల పరిధిని విస్తరించడం లక్ష్యంగా చేసుకున్నాము అని తెలిపారు.
తర్వాతి కథనం
సోనియా బయోగ్రఫీ ఆధారంగా సినిమా తీస్తా : కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి