1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Emirates starts flight services between India and Dubai from next week

వచ్చే వారం నుంచి భారత్‌కు ఎమిరేట్ విమాన సర్వీసులు పునరుద్ధరణ

Emirates Flight Service
కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా భారతదేశానికి వచ్చే అన్ని విదేశీ విమాన సర్వీసులు నిలిపివేశారు. ఇపుడు కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతుడటంతో ఒక్కో దేశం క్రమంగా విమాన సేవలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. 
 
ఇందులోభాగంగా, దేశంలో వైరస్ ప్రభావం అంతకంతకూ తగ్గుతున్న నేపథ్యంలో యునైటెడ్ ఎమిరేట్స్‌కు చెందిన విమానయాన సంస్థ ఎమిరేట్స్ వచ్చే వారం నుంచి సేవలను పునరుద్ధరించేందుకు సిద్ధమైంది. కరోనా ఉద్ధృతి కారణంగా ఈ ఏడాది ఏప్రిల్ 25న దుబాయ్-భారత్ మధ్య  విమాన సేవలు నిలిచిపోయాయి. 
 
ప్రస్తుతం దక్షిణాఫ్రికా, నైజీరియా, భారతదేశ ప్రయాణికుల కోసం సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తాజాగా ఎమిరేట్స్ సంస్థ తెలిపింది. భారత ప్రయాణికులు వారి రెసిడెన్స్ వీసాతోపాటు యూఏఈ ధ్రువీకరించిన రెండు కరోనా టీకా డోసులను తీసుకున్న వారికి ఎమిరేట్స్ విమానంలో ప్రయాణించేందుకు అనుమతి లభిస్తుందని పేర్కొంది. ప్రయాణానికి ముందు ఆర్టీపీసీఆర్ పరీక్షకు సంబంధించి నెగటివ్ సర్టిఫికెట్ కూడా తప్పనిసరి అని స్పష్టం చేసింది.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
మమతా బెనర్జీ సారథ్యంలో థర్డ్ ఫ్రంట్... నేడు విపక్ష నేతల భేటీ