1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. No cash reserve in Banks

బ్యాంకుల్లో నిండుకున్న నగదు నిల్వలు.. ఆర్బీఐ నుంచి కరెన్సీ నోట్లు ఎపుడు వస్తాయో తెలియని వైనం!

రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన బ్యాంకుల్లో నగదు నిల్వలు నిండుకున్నాయి. దీంతో సోమవారం నగదు లావాదేవీలను నిలిపివేశారు. అదేసమయంలో కొత్త నోట్లు బ్యాంకులకు ఎపుడు వస్తాయో కూడా తెలియదు. ఈ పరిణామాలను పరిశీలిస్తే

banks
రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన బ్యాంకుల్లో నగదు నిల్వలు నిండుకున్నాయి. దీంతో సోమవారం నగదు లావాదేవీలను నిలిపివేశారు. అదేసమయంలో కొత్త నోట్లు బ్యాంకులకు ఎపుడు వస్తాయో కూడా తెలియదు. ఈ పరిణామాలను పరిశీలిస్తే.. మరో మూడు రోజులపాటూ ఇదే పరిస్థితి కొనసాగనుందని బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. 
 
దేశంలో పెద్ద నోట్లను రద్దు చేయడంతో కరెన్సీ కష్టాలు తలెత్తిన విషయం తెల్సిందే. కొనుగోలు చేసేందుకు మాత్రమే కాకుండా, చివరకు బ్యాంకుల్లోని ఖాతాదారులకు సైతం డబ్బులు చెల్లించలేని దయనీయ పరిస్థితి నెలకొంది. ఉన్న డబ్బునే సర్దుకోవాలి కాబట్టి విత్‌డ్రాయల్స్‌ పరిధిని రూ.24 వేల నుంచి 4 వేలకు కుదించారు కూడా. 
 
నిజానికి ఒక ఖాతాదారుడు వారానికి రూ.24 వేలను.. నాలుగు సార్లుగా డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ, బ్యాంకుల్లో నగదు నిల్వలు నిండుకోవడంతో డ్రా చేసుకునే సొమ్మును రూ.4 వేలకే తగ్గించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్‌బీఐ నుంచి డబ్బు వచ్చేవరకు ఏమి చేయలేమని ఒక ప్రధాన బ్యాంకు అధికారి నిస్సహాయత వ్యక్తం చేశారు. 
 
ఇంకా, రూ.50 నోట్లు చిరిగిపోయిన రూ.100 నోట్లున్నాయి. అత్యవసరాల్లో స్పాయిల్‌ నోట్స్‌ను ఇవ్వొచ్చని ఆర్‌బీఐ చెబుతోంది. ఈ పాత నోట్లతో మంగళవారం నెట్టుకురావచ్చు. ఆ తర్వాత ఏమి చేయలేం. మంగళవారం డబ్బులొచ్చినా అన్ని బ్యాంకులకు పంపడం ఆలస్యమవుతుంది. డబ్బే రాకుంటే మరీ ఇబ్బంది అవుతుంది. ఇంకో మూడు రోజుల పాటు పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదని బ్యాంకు అధికారులు చెపుతున్నారు.
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
వైఎస్సార్ సెంటిమెంట్‌ను బలంగా నమ్ముతున్న రేవంత్ రెడ్డి.. వైఎస్సార్‌కు సబితక్క-నాకు సీతక్క?!