సంబంధిత వార్తలు
- ఇంటికో ఉద్యోగం... వాషింగ్‌మెషీన్ ఫ్రీ... ఉచిత ఇల్లు... అన్నాడీఎంకే వరాల జల్లు
- డీఎంకే రూ.1000 ఇస్తే.. అన్నాడీఎంకే రూ.1500 ఇస్తుంది.. ఫ్రీ గ్యాస్ కూడా...
- వంట గ్యాస్ సిలిండర్‌పై రాయితీ గతంలో రూ.500 దాకా వచ్చేది, ఇప్పుడు రూ.16కి పడిపోయింది- ప్రెస్ రివ్యూ
- బాదుడే బాదుడు.. పెరిగిన వంటగ్యాస్ ధరలు..
- అప్పటివరకు పెట్రో భారం భరించాల్సిందే : ధర్మేన ప్రధాన్
రూ. 170లకే సిలిండర్.. ఎలా పొందాలో తెలుసా..?
గ్యాస్ సిలిండర్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో రూ. 170లకే సిలిండర్ పొందవచ్చు. అయితే మొదటి సారి పేటీఎం ద్వారా గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారులకే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే మరో ఏడు రోజులు మాత్రమే.
ఎలాగంటే.. ప్రముఖ పేమెంట్ యాప్ పేటీఎం వినియోగదారులకు ఒక ప్రత్యేక ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనివల్ల గ్యాస్ బుకింగ్‌పై రూ.700 వరకు క్యాష్ బ్యాక్ అందుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. మీరు కూడా ఈ క్యాస్ బ్యాక్ అందుకోవాలంటే ఇలా చేయండి.
పేటీఎం యాప్‌లో రీఛార్జ్ అండ్ పే బిల్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. బుక్ గ్యాస్ సిలిండర్ ఆప్షన్‌ను ఎంచుకోండి. ఇక్కడ మీరు వాడే సిలిండర్ కంపెనీని సెలెక్ట్ చేసుకోండి. రిజిస్టర్ మొబైల్ నంబర్ లేదా మీ ఎల్‌పీజీ ఐడీని నమోదు చేయండి.
బిల్ పే చేసిన తర్వాత సిలిండర్ ను బుక్ చేసుకోవచ్చు. సిలిండర్ బుక్ చేసుకున్న 24 గంటల్లో మీకు రూ. 700 వరకు విలువ కలిగిన క్యాష్ బ్యాక్ స్క్రాచ్ కార్డు వస్తుంది. ఈ కార్డును మీరు 7 రోజుల్లోగా ఉపయోగించాల్సి ఉంటుంది.
