సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 26 మార్చి 2021 (13:32 IST)

'క్వాడ్' కూటమి ఏర్పాటుకు డ్రాగన్ కంట్రీ తీవ్ర వ్యతిరేకత!

క్వాడ్ కూటమిని డ్రాగన్ కంట్రీ తీవ్ర వ్యతిరేకిస్తోంది. ఈ కూటమిని తాను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని చైనా ప్రకటించింది. భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు సంయుక్తంగా క్వాడ్‌ కూటమిగా అవతరించాయి. ఈ కూటమిని చైనా వ్యతిరేకించింది. 
 
అదేసమయంలో ఏమీలేని చోట సమస్యలు సృష్టించవద్దని అమెరికాను హెచ్చరించింది. ఈ ప్రాంతంలో శాంతిని పెంపొందించే చర్యలు చేపట్టాలని హితవు పలికింది. ఈ మేరకు చైనాకు చెందిన మినిస్ట్రీ ఆఫ్‌ నేషనల్‌ డిఫెన్స్‌లోని సీనియర్‌ కర్నల్‌ రెన్‌గావ్‌కియాంగ్‌ పేర్కొన్నారు. అమెరికా నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ జాక్‌ సులైవాన్‌ ఇటీవల చేసిన ప్రకటనకు బదులిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
 
‘‘అమెరికా ప్రోత్సాహంతో మొదలైన చతుర్భుజ కూటమిని మేము వ్యతిరేకిస్తున్నాం. అది ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వాన్ని కొనసాగిస్తోంది. ఒక జట్టుగా పోరాడటాన్ని క్వాడ్‌ వ్యవస్థ నమ్ముతోంది. ఈ ప్రాంతంలోని దేశాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతోంది. మేము దీనికి వ్యతిరేకం. శాంతి, అభివృద్ధితో ఇరుపక్షాలు లాభపడాల్సిన సమయం ఇది.  దీనికి వ్యతిరేకంగా ఏ ఒక్కరి అవసరాలో తీరేందుకు ఉపయోగపడాలని భావిస్తే అది విఫలం కావడం ఖాయం. ప్రపంచ శాంతి, అభివృద్ధికి చైనా కట్టుబడి ఉంది’’ అని రెన్‌ పేర్కొన్నారు.