మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 మార్చి 2021 (08:15 IST)

వన్డే సిరీస్‌పై కన్ను.. ట్రోఫీని గెలుచుకునేందుకు సిద్ధమైన కోహ్లీ సేన.. శ్రేయాస్ స్థానంలో ఎవరు?

టీమిండియా మరో కీలక పోరుకు సిద్ధమవుతోంది. ఇంగ్లండ్‌తో ఇప్పటికే టెస్టు, టీ20 సిరీస్‌లను సొంతం చేసుకున్న టీమిండియా వన్డే ట్రోఫీని దక్కించుకోవాలని చూస్తోంది. ముచ్చటగా మూడో సిరీస్‌నూ ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమవుతోంది. పుణే వేదికగా జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే తొలి మ్యాచ్‌ ముగియగా శుక్రవారం మూడో వన్డే జరగనుంది. 
 
మెుదటి వన్డేలో ప్రత్యర్థిని చిత్తుగా ఓడించిన కోహ్లీసేన నేటి మ్యాచ్‌లోనూ జయకేతనం ఎగరవేయాలని చూస్తోంది. ప్రస్తుతం టీమిండియాకు గాయాలు అడ్డంకిగా మారాయి. గాయం కారణంగా వన్డే సిరీస్‌కు దూరమైన శ్రేయస్‌ స్థానంలో సూర్యకుమార్‌ లేదా పంత్‌ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
 
టీమిండియా పరిస్థితిని చూస్తే.. గత మ్యాచ్‌తో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఫామ్‌లోకి వచ్చారు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ, కెప్టెన్‌ కోహ్లీలతో టాప్‌ఆర్డర్‌ ఓకే.. రాహుల్‌తో మిడిలార్డర్ బలంగానే ఉంది. సూర్యకుమార్‌ రాకతో ఆ స్థానం మరింత స్ట్రాంగ్ అవుతుంది.
 
చివరిలో మెరుపులు మెరిపించడానికి హార్థిక్,కృనాల్ రేడీగా ఉన్నారు. ఇక బౌలింగ్‌ విషయానికి వస్తే భువనేశ్వర్‌ అనుభవంతో. శార్దూల్‌ ఠాకూర్ ఇన్‌స్వింగ్ మాయతో ప్రత్యర్థిని బోల్లా కొట్టించగలరు. అరంభ మ్యాచ్‌లోనే ఆదరగొట్టిన ప్రసిద్ధ్‌ కృష్ణ ఉండనే ఉన్నాడు.
 
అయితే ఈ మ్యాచ్‌లో ఠాకూర్‌కు రెస్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ స్థానంలో నటరాజన్‌ లేదా సిరాజ్‌ను జట్టులోకి రావచ్చు. .ఇక స్పిన్‌ విభాగమే అంచనాలను అందుకోలేక పోతుంది. గత మ్యాచ్‌లో కుల్‌దీప్‌ ఆకట్టుకోలేకపోయాడు. దీంతో అతని స్థానంలో చాహల్‌ తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.