సంబంధిత వార్తలు
- భారత మహిళా క్రికెట్ జట్టుతో ఎస్బిఐ లైఫ్- బీసీసీఐ మీట్ అండ్ గ్రీట్
- కమ్యూనిటీల వ్యాప్తంగా బ్రెస్ట్ హెల్త్: ఎస్‌బీఐ లైఫ్ థాంక్స్-ఎ-డాట్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్
- థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన
- ఫ్యూచర్ రెడీ బీమా పథకంతో ఎస్‌బీఐ లైఫ్ – స్మార్ట్ షీల్డ్ ప్లస్
- ఎస్.బి.ఐ లైఫ్ నుంచి పాపా హై నా - ఫాదర్ హార్ట్‌ఫెల్ట్ జర్నీ
ఎస్‌బీఐ లైఫ్-స్మార్ట్ ప్లాటినా అడ్వాంటేజ్‌ను ఆవిష్కరించిన ఎస్‌బీఐ లైఫ్
నేడు వేగంగా మారిపోతున్న ప్రపంచంలో బాధ్యతలతో పాటు ఆకాంక్షలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక భద్రతనేది కేవలం ఆర్థికాంశాలకే పరిమితం కాకుండా నిశ్చితత్వం, మానసిక ప్రశాంతత, జీవితపు ప్రతి దశలోను ప్రియమైన వారికి సంరక్షణ అందించగలిగే సామర్థ్యాలకు సంబంధించినదిగా ఉంటోంది. దీన్ని గుర్తించే, భారతదేశపు విశ్వసనీయమైన అతి పెద్ద ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ దిగ్గజాల్లో ఒకటైన ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ తమ ఎస్‌బీఐ లైఫ్- స్మార్ట్ ప్లాటినా అడ్వాంటేజ్ పేరిట ఇండివిడ్యువల్, నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది పాలసీ వ్యవధి ఆసాంతం జీవిత బీమా భద్రతతో పాటు దీర్ఘకాలికంగా కచ్చితమైన ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
పిల్లల చదువులు, రిటైర్మెంట్ ప్రణాళికలు, నిధిని సమకూర్చుకోవడం, రెండో ఆదాయ మార్గాన్ని ఏర్పర్చుకోవడం ఇలా జీవితంలో ఏ మైలురాయి కోసమైనా ధీమాగా ప్రణాళిక వేసుకునేందుకు వీలు కల్పించేలా ఇది డిజైన్ చేయబడింది. పాలసీ అమల్లో ఉన్న ప్రతి సంవత్సరంలోను కచ్చితమైన జోడింపుల ద్వారా క్రమశిక్షణతో నిధిని సమకూర్చుకోవడంలో పాలసీదారులకు ఎస్‌బీఐ లైఫ్- స్మార్ట్ ప్లాటినా అడ్వాంటేజీ తోడ్పడుతుంది. ఊహించతగిన అంచనాలకు సరళత్వాన్ని మేళవించిన విధంగా ఉండటం ద్వారా పరిమిత కాలం పాటు ప్రీమియంలను చెల్లించిన మీదట నిర్దిష్ట మెచ్యూరిటీ ప్రయోజనాలను తప్పకుండా పొందేలా తోడ్పడుతుంది.
ఎస్‌బీఐ లైఫ్- స్మార్ట్ ప్లాటినా అడ్వాంటేజ్ ప్రత్యేక ఫీచర్లు:
జీవిత బీమా కవరేజీతో దీర్ఘకాలికంగా గ్యారంటీడ్ ప్రయోజనాలు.
పరిమిత వ్యవధికి ప్రీమియంలు కట్టి, పాలసీ వ్యవధి ఆసాంతం జీవిత బీమా కవరేజీని పొందవచ్చు.
ఆదాయ పన్ను చట్టం, 1961లో నిర్దిష్ట నిబంధనల కింద పన్ను ప్రయోజనాలు.
మెచ్యూరిటీ అనంతరం నిధుల లభ్యత, ఆర్థిక వెసులుబాటుపరంగా ఉపయోగకరంగా ఉండేలా మెచ్యూరిటీ మొత్తాన్ని వాయిదాల రూపంలో తీసుకునే ఆప్షన్.
ఎస్‌బీఐ లైఫ్- స్మార్ట్ ప్లాటినా అడ్వాంటేజ్‌కి సంబంధించి మరిన్ని వివరాల కోసం దయచేసి సందర్శించండి.
