1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Vijay Mallya extradition case: Arthur Road Jail keeps high security cell ready

విజయ్ మాల్యాను భారత్‌కు రప్పిస్తే.. జైలు సిద్ధంగా వుందట...

Vijay Mallya extradition case
రుణాల ఎగవేతలో భాగంగా బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా.. రాజీకొచ్చారు. బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధంగా వున్నానని విజయ్ మాల్యా స్పష్టం చేశారు. 
 
తాను రుణాలను ఎగవేసే వ్యక్తిని కాదన్నారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేస్తూ.. బ్యాంకుల నుంచి రుణాలు పొంది పారిపోయానని సోషల్ మీడియా, మీడియా కోడైకూస్తోంది. దీనిపై విజయ్ మాల్యా మండిపడ్డారు. కోర్టులో తాను రుణం చెల్లించేందుకు సిద్ధంగా వున్న విషయాన్ని మీడియా ఎందుకు ఫోకస్ చేయలేదని ప్రశ్నించారు. 
 
ఈ నేపథ్యంలో విజయ్ మాల్యాను భారత్‌కు రప్పిస్తే ఆయనను ఉంచేందుకు జైలు సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. మాల్యాను భారత్‌కు తరలిస్తే ఆయనను ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలు నెంబర్ 12 బ్యారెక్‌లో ఉంచనున్నారు. ఇందులో కొన్ని సదుపాయాల్ని సీబీఐ అధికారులు వీడియోలు తీసి గతంలోనే లండన్ కోర్టుకు జైలు అధికారులు పంపించారు. 
 
విజయ్ మాల్యాను ఉంచనున్న సెల్‌లో ఎల్సీడీ టీవీ, మెత్తటి పరుపు, దిండు, దుప్పట్లు ఏర్పాట్లు చేశారు. టీవీలో ఇంగ్లీష్, మరాఠీ ఛానెల్స్ వచ్చే ఏర్పాటు చేశారు. మాల్యాను ఉంచనున్న జైలుగదిలో అటాచ్డ్ టాయిలెట్ కూడా ఉందని జైలు అధికారులు వీడియోలో తెలిపారు. 
తర్వాతి కథనం
చల్లటి శీతాకాలంలో ఎర్రటి మిరపపండ్లు తింటే...