బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 26 సెప్టెంబరు 2018 (12:45 IST)

నన్‌పై రేప్.. బిషప్ జైలుకెళ్తే.. చేపలు, చికెన్ తిన్నారని రాస్తారా?

భక్తి ముసుగులో లైంగిక వేధింపులకు పాల్పడే బాబాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. కేరళకు చెందిన నన్‌పై 13 సార్లు అత్యాచారానికి పాల్పడి అరెస్టయిన బిషప్‌కు జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెంద

భక్తి ముసుగులో లైంగిక వేధింపులకు పాల్పడే బాబాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. కేరళకు చెందిన నన్‌పై 13 సార్లు అత్యాచారానికి పాల్పడి అరెస్టయిన బిషప్‌కు జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన సన్యాసినిపై అత్యాచారం చేశాడనే కేసులో అరెస్టైన బిషప్ ప్రాంకో ములక్కల్‌‌ను జ్యూడీషీయల్ రిమాండ్‌కు తరలిస్తూ మెజిస్ట్రేట్ ఆదేశించారు. 
 
అక్టోబర్ ఆరో తేదీ వరకు జ్యూడీషియల్ రిమాండ్‌ను కోర్టు విధించింది. 2014 -16 మధ్య కాలంలో సన్యాసినిపై బిషప్ 13 దఫాలు అత్యాచారం చేసినట్టుగా బాధితురాలు ఆరోపిస్తోంది. రిమాండ్ ఖైదీ బిషప్‌కు జైలు అధికారులు 5968 నెంబర్ కేటాయించారు. అత్యాచారానికి పాల్పడి జైలుకెళ్తున్న బిషప్‌పై స్టోరీలు కవర్ చేస్తూ మీడియా ఓవరాక్షన్ చేస్తోంది. 
 
జైలుకు తరలించే ముందు బిషప్ తనకు ఇష్టమైన చేపలకూరతో భోజనం చేశాడని మీడియా వెల్లడిస్తోంది. కానీ బిషప్ చికెన్ కూరతో భోజనం చేశాడని జైలు అధికారులు చెప్తున్నారు. సాధారణ ఖైదీ మాదిరిగానే బిషప్‌ను ట్రీట్ చేస్తున్నామని జైలు అధికారులు ప్రకటించారు. జైలు గదిలోకి వెళ్లగానే బిషప్ ప్రశాంతంగా నిద్రపోయాడని అధికారులు ప్రకటించారు. ఈ కేసులో బిషప్‌ను విచారించేందుకుగాను పోలీసులు కస్టడీ పిటిషన్‌ను దాఖలు చేస్తున్నారు.