క్లాట్ 2023 నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 13 వరకు అప్లై చేసుకోవచ్చు..
Law
దేశవ్యాప్తంగా లా యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ టెస్టును రాయాలంటే.. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్, 10+2 తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించాలి.
ఇకపోతే 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా క్లాట్ ప్రవేశ పరీక్ష (యూజీ)కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన అభ్యర్ధులు/ ఎల్‌ఎల్‌బీ చివరి సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్ధులు క్లాట్ ఎల్‌ఎల్‌ఎమ్ (పీజీ)కు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో నవంబర్ 13, 2022వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్‌ఎల్‌యూ విద్యార్ధులకు సూచించింది.
