శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 21 అక్టోబరు 2022 (18:31 IST)

లెహరాయి నుండి నువ్వు వందసార్లు వద్దన్న పాట విడుదల

leharayi eam with mehar ramesh
leharayi eam with mehar ramesh
ఎస్ఎల్ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణలో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న చిత్రం 'లెహరాయి'. రామకృష్ణ పరమహంసను ద‌ర్శ‌కుడి గా ప‌రిచ‌యం చేస్తూ మద్దిరెడ్డి శ్రీనివాస్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో ధ‌ర్మ‌పురి ఫేం గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ చాలా ఫేమ‌స్ కావ‌టం విశేషం. ఇదివరకే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్ కు, సాంగ్స్ కు విశేష స్పందన లభించింది. ఇక సంగీత ద‌ర్శకుడు ఘంటాడి కృష్ణ ఈ చిత్రంతో జీకే ఈజ్ బ్యాక్ అన్నట్టు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. 
 
ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుద‌లైన గుప్పెడంత సాంగ్ మిలియ‌న్ వ్యూస్ తెచ్చుకుంది. ఈ స‌క్సస్ ను పురస్కరించుకుని లెహ‌రాయి చిత్రం నుండి "నువ్వు వందసార్లు వద్దన్న" అనే మరో సాంగ్ ను కూడా విడుద‌ల చేశారు మేకర్స్. ఈ పాటని ఉమ మహేశ్వరరావు తమ్మిరెడ్డి రచించారు.ఈ పాటను హరిచరణ్ ఆలపించారు.
ఈ పాటలోని     "నీ మీద ప్రేమ కొలవలేనులే   అది నీకు చెప్పాలంటే 
భాషే చాలదు తెలుసా   గడియ కూడా నీ ఎడబాటు   ఊహించడం నా తరమా"
లాంటి  లైన్స్ ఆకట్టుకున్నాయి.
 
ఈ చిత్రంలో మొత్తం 7 సాంగ్స్ ఉన్నట్లు, మంచి ఫీల్ ఉన్న క‌థతో ఈ సినిమాను తెర‌కెక్కించినట్లు ఇదివరకే ద‌ర్శకుడు రామ‌కృష్ణ ప‌ర‌మ‌హంస" తెలిపారు. ప్రముఖులు న‌టించిన ఈ చిత్రాన్ని నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పిస్తున్నారు. లెహరాయి రిలీజ్ డేట్ ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది చిత్ర బృందం.