సంబంధిత వార్తలు
- గ్రాండ్‌గా ప్రారంభమైన ధనుష్, సందీప్ కిషన్ నటిస్తున్నకెప్టెన్ మిల్లర్
- ధనుష్ కెప్టెన్ మిల్లర్‌లో కథానాయికగా ప్రియాంక మోహన్ (video)
- విడుతలై చిత్రం కోసం కొడైకెనాల్లో విజయ్ సేతుపతి, సూరి పై యాక్షన్ సన్నివేశాలు
- సూర్య 42వ సినిమా అప్డేట్ రేపు రాబోతుంది
- విజయ్ సేతుపతి, సూరి నటిస్తున్న విడుతలై చిత్రానికి 10కోట్లతో రైలు బ్రిడ్జి సెట్
యాక్షన్, రొమాన్స్ వున్న మైఖేల్ టీజర్ రాబోతుంది
Sandeep Kishan, Divyansha Kaushik
ఈరోజు నిర్మాతలు ఈ సినిమా టీజర్‌కి సంబంధించిన అప్‌డేట్‌ను అందించారు. 'మైఖేల్ టీజర్ అక్టోబర్ 20న విడుదల కానుంది. పోస్టర్‌లో సందీప్, దివ్యాంశ కౌశిక్ పెదవులపై ముద్దు పెట్టుకోవడం, బ్యాక్ గ్రౌండ్ లో ఎగిరే పక్షులతో పోస్టర్ డిజైన్ చేయడం రొమాంటిక్ గా ఉంది. సినిమాలో యాక్షన్‌తో పాటు రొమాన్స్ కూడా ఉంటుందని ఈ పోస్టర్ తెలియజేస్తోంది.
ఈ చిత్రంలో స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ విలన్ నటిస్తుండగా, వరలక్ష్మి శరత్‌కుమార్, వరుణ్ సందేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి సహా నిర్మాణంలో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా గా సినిమాగా తెరకెక్కుతున్న మైఖేల్ చిత్రాన్ని నారాయణ్ దాస్ కె.నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
