శుక్రవారం, 1 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 8 సెప్టెంబరు 2022 (18:18 IST)

సూర్య 42వ సినిమా అప్‌డేట్ రేపు రాబోతుంది

Siva 42 poster
Siva 42 poster
విల‌క్ష‌ణ న‌టుడు సూర్య న‌టించ‌నున్న 42వ సినిమా గురించి మ‌రిన్ని వివ‌రాలు సెప్టెంబ‌ర్‌9న రాబోతున్నాయి. దర్శకుడు శివ తో సూర్య తన 42వ ప్రాజెక్ట్ గా అనౌన్స్ చేశారు. ఇటీవ‌లే క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన `విక్ర‌మ్‌` సినిమాలో క్ల‌యిమాక్స్‌లో మాఫియా బాస్‌గా కాసేపు క‌నిపించి అల‌రించారు. దాని సీక్వెల్‌గా వుండేందుకు అవ‌కాశం వుంద‌నేలా ఆయ‌న పాత్ర‌ను డిజైన్ చేయ‌డం విశేషం.
 
కాగా, ఇప్పుడు సూర్య 42 సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి.దీనికి సంబంధించిన పోస్ట‌ర్‌ను నేడు విడుద‌ల చేశారు. న‌ల్ల‌టి మేఘాలు ప‌ట్టి పొలాల‌పై వాన కురిసేట్లుగా డిజైన్ చేశారు. ఇది సామాజిక అంశంతో కూడుకున్న చిత్రంగా తెలుస్తుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు. యువి క్రియేష‌న్స్‌, స్టూడియో గ్రీన్ నిర్మాణంలో ఈచిత్రం రూపొందుతోంది. జ్జాన‌వేల్ రాజా స‌మ‌ర్ప‌కుడు.