ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 5 సెప్టెంబరు 2022 (14:53 IST)

శర్వానంద్, రాశి ఖన్నా జంట‌గా చిత్రం ప్రారంభం

Sharwanand and Raashi Khanna clap by trivikram
ప్రామిసింగ్ హీరో శర్వానంద్ తన 33వ చిత్రం కోసం అత్యంత ప్రతిభ గల రచయిత, దర్శకుడు కృష్ణ చైతన్యతో కలసి పని చేస్తున్నారు. టాలీవుడ్ లో విజయవంతమైన నిర్మాతలలో ఒకరైన టిజి విశ్వ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందనుంది.
 
ఈ చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైయింది. నిర్మాతలు, చందూ మొండేటి, హను రాఘవపూడి, సుధీర్ వర్మ, యువి క్రియేషన్స్ వంశీ, విక్రమ్ స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందజేశారు. ముహూర్తం షాట్‌కు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్‌బోర్డ్‌ను ఇవ్వగా, కృష్ణ చైతన్య స్వయంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుండి ప్రారంభమవుతుంది.
 
పవర్ ఫుల్ స్క్రిప్ట్ లో శర్వానంద్ ని ఇంటెన్స్ క్యారెక్టర్ లో చూపించనున్నారు కృష్ణ చైతన్య. రాశి ఖన్నా కథానాయికగా నటిస్తుండగా, ప్రియమణి కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో మరికొందరు ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
 
అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించనుండగా, జిమ్షీ ఖలీద్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. జయశ్రీ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, విటల్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.
 
సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు.
 
తారాగణం: శర్వానంద్, రాశి ఖన్నా, ప్రియమణి
సాంకేతిక విభాగం- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణ చైతన్య
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: యువన్ శంకర్ రాజా
డీవోపీ: జిమ్షి ఖలీద్
ఫైట్స్: సుప్రీమ్ సుందర్
ప్రొడక్షన్ డిజైనర్: జయశ్రీ
ఆర్ట్ : విటల్
పీఆర్వో: ఎల్ వేణుగోపాల్, వంశీ-శేఖర్
డిజిటల్ మార్కెటింగ్ హెడ్ : వాణి మాధవి అవసరాల
కంటెంట్ హెడ్: సత్య భవన కాదంబరి