మణిరత్నం పొన్నియన్ సెల్వన్ గట్టెక్కెనా!
చారిత్రాత్మక నేపథ్యంలో కథలు ఇప్పుడు వెండితెరపై రావడం జరుగుతున్నాయి. తెలుగులో బాహుబలి తర్వాత అందరి ఆలోచనలు మారిపోయాయి. గతంలో బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు వచ్చినా బాహుబలి సినిమా ముందు అన్నీ బలాదూర్‌గా నిలిచాయి. అంతటి క్రేజ్ ఏర్పర్చిన రాజమౌళిపై చాలామంది ప్రశంసలు కురిపిస్తుంటే మరికొందరు సినిమా రంగాన్ని నాశనం చేసేశాడనేది కొందరి అభిప్రాయం. ఆయన తీసిన సినిమాలను చూసిన కళ్ళతో ఇంచుమించు ఆ తరహా సినిమాలు వచ్చినా ప్రేక్షకులు చూడ్డానికి ఇష్టపడడంలేదు. ఇటీవలే బింబిసార చిత్రం కూడా అటువంటి కోవలేనిదే. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఆ సినిమా హిట్ అంటూ చిత్రయూనిట్ సంబరాలు చేసుకున్నా ఆశించిన స్థాయిలో లేదని సినీ ట్రేడ్ వర్గాల విశ్లేషణ. అసలు హిట్ అనేది కార్తికేయ2 లాంటి సినిమానే అంటూ సినీ వర్గాలు తెలియజేస్తున్నాయి.
ఇక బాహుబలి తరహాలోనే మహాభారం కథను తెరకెక్కించేందుకు మలయాళంలో పలువురు ప్రయత్నించారు. అది పూర్తికాలేదు. అలాంటి టైంలో ఇంతకుముందు పెద్ద సక్సెస్ దర్శకుడిగా పేరుపొందిన మణిరత్నం ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఇది తమిళం మూలాల్లోని ఓ నవల ఆధారంగా తెరకెక్కింది .రెండు భాగాలు తీస్తున్న ఈ సినిమా మొదటి పార్ట్ ఈనెలాఖరులో విడుదలకాబోతుంది. నిన్ననే చెన్నైలో పలు భాషల్లో ఈ చిత్రం ట్రైలర్ విడుదలయింది. ట్రైలర్ చూస్తుంటే అన్ని భాషలకు చెందిన నటీనటులు కనువిందుగా కనిపించారు.కానీ ఎక్కడా సామాన్యుడిని ఆకట్టుకునే ట్విస్ట్ తరహాలో లేదనేది సినీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ట్రైలర్ ను చూస్తుంటే మరోసారి బాహ/బలిని చూసినట్లుందంటూ కొందరు వ్యాఖ్యానించడం విశేషం.
మరో వైపు మణిరత్నంతోపాటు లైకా వంటి అగ్రనిర్మాణ సంస్థలు నిర్మించిన ఈ సినిమా ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాల్సిందే. బాహుబలి1,2 సినిమాలు ఊహించని విజయాన్ని, కలెక్షన్లు రాబట్టుకున్నాయి. మరి పులిని చూసి నక్క వాత పెట్టినట్లుగా వుంటుందా? అనేది త్వరలో తెలియనుంది.