శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 9 జులై 2022 (12:56 IST)

విక్ర‌మ్‌కి గుండెపోటు కాదు ఛాతీనొప్పి... తెలియకుండా వార్తలు రాయొద్దు: మేనేజ‌ర్‌

Chian Vikram
Chian Vikram
న‌టుడు చియాన్ విక్ర‌మ్‌కు గుండె నొప్పివ‌చ్చింద‌ని ఆసుప‌త్రిలో అడ్మిట్ అయ్యాడ‌ని నిన్న వార్త‌లు వ‌చ్చాయి. అదేరోజు పొన్నియ‌న్ సెల్వ‌న్ ట్రైల‌ర్‌కూడా విడుద‌ల‌యింది. ఈ స‌మ‌యంలో ఇలా విక్ర‌మ్ ఆసుప‌త్రిలో జేరార‌న‌గా అభిమానులు ఆందోళ‌న‌కు గురయ్యారు. అయితే దీనిపై విక్ర‌మ్ మేనేజ‌ర్ సూర్య‌నారాయ‌ణ్ ఓ ప‌త్రిక‌కు ఇలా తెలియ‌జేశాడ‌ని తెలిసింది.

 
విక్ర‌మ్‌కు గుండెపోటు అన్న‌ది నిజంకాదు. ఇదంతా ఫేక్‌. ఆసుప‌త్రికి వెళ్ళిన మాట నిజ‌మే. ఛాతిలో కొద్దిగా అసౌక‌ర్యంగా వుంటే టెస్ట్ చేయించారు. ఇప్పుడు అంతా బాగానే వున్నారు. అభిమానులు ఆందోళ‌న ప‌డాల్సిన అవ‌స‌రంలేదంటూ విక్ర‌మ్ మేనేజ‌ర్ క్లారిటీ ఇచ్చాడు. ఆసుప‌త్రి నుంచి డిచ్చార్జ్ అవుతారు. కంగారు ప‌డ‌కండి, అలాంటి అవాస్తవ వార్తలను నమ్మొద్దు అంటూ పేర్కొన్నాడు.