మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 4 మార్చి 2022 (17:42 IST)

మ‌ణి ర‌త్నం పొన్నియిన్ సెల్వన్ సెప్టెంబర్ 30న గ్రాండ్ రిలీజ్‌

Trisha-iswarya
విక్ర‌మ్‌, జ‌యం ర‌వి, కార్తి, ఐశ్వ‌ర్యా రాయ్‌, త్రిష ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణి ర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, మ‌ద్రాస్ టాకీస్ ప‌తాకాల‌పై మ‌ణిర‌త్నం, అల్లిరాజా సుభాస్క‌ర‌న్ నిర్మాత‌గాలుగా రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ హిస్టారిక‌ల్ ఫిక్ష‌న‌ల్ ఎపిక్ డ్రామా ‘పొన్నియిన్ సెల్వన్’. భారీ నిర్మాణ విలుువలతో, హై టెక్నికల్ వేల్యూస్‌తో రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతోంది. అందులో మొద‌టి భాగం ‘పొన్నియిన్ సెల్వ‌న్ 1’ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. 
 
లైకా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత సుభాస్క‌ర‌న్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. సినిమాను ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 30న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. సినిమాలో ప్ర‌ధాన తారాగ‌ణ‌మైన విక్ర‌మ్‌, జ‌యం ర‌వి, కార్తి, ఐశ్వ‌ర్యా రాయ్‌, త్రిష పాత్ర‌లకు సంబంధించిన లుక్స్‌ను విడుద‌ల చేశారు. ఒక్కో లుక్ ఒక్కో త‌ర‌హాలో డిఫ‌రెంట్‌గా ఆక‌ట్టుకుంటోంది. 
 
ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత అందిస్తున్న ఈ చిత్రానికి ర‌వి వ‌ర్మ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఎ.శ్రీకర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.