శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 22 సెప్టెంబరు 2022 (17:18 IST)

గ్రాండ్‌గా ప్రారంభ‌మైన ధనుష్, సందీప్ కిషన్ న‌టిస్తున్నకెప్టెన్ మిల్లర్‌

Dhanush, Sandeep Kishan, Arun Matheswaran, Priyanka Mohan
Dhanush, Sandeep Kishan, Arun Matheswaran, Priyanka Mohan
జాతీయ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై బడ్జెట్ పీరియడ్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’ పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా గురువారంనాడు చెన్నైలో ప్రారంభ‌మ‌యింది. ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న వెర్స‌టైల్ న‌టుడు సందీప్ కిషన్,  ధనుష్ సరసన న‌టించ‌నున్న బ్యూటీఫుల్ నాయిక‌ ప్రియాంక మోహన్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.
 
ఇప్ప‌టికే కెప్టెన్ మిల్లర్ తన అద్భుతమైన ఫస్ట్-లుక్ మోషన్ పోస్టర్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రారంభానికి ముందు నుంచి వ‌స్తున్న అప్‌డేట్‌తో టీమ్ భారీ అంచనాలను నెలకొల్పింది. ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
 
ఈ అద్భుతమైన స్టార్ కాస్ట్ కాంబినేషన్‌తో, ‘కెప్టెన్ మిల్లర్’ తెలుగు ప్రేక్షకుల అంచ‌నాల‌కు ద‌గ్గ‌ర‌య్యేలా ఉంటుంది. ధనుష్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ఇది. 1930-40ల నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ ఫిల్మ్‌ని టి.జి. త్యాగరాజన్ సత్యజ్యోతి ఫిల్మ్స్ మరియు సెంధిల్ త్యాగరాజన్ మరియు అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని జి. శరవణన్, సాయి సిద్ధార్థ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
 
బాహుబలి ఫ్రాంచైజీ, RRR మరియు పుష్ప వంటి చిత్రాలకు పనిచేసిన మధన్ కార్కీ ఈ చిత్రం తమిళ వెర్షన్‌కు డైలాగ్స్ రాశారు. ఇతర సాంకేతిక నిపుణులయిన‌ జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, నాగూరన్ ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు, ఇందులో టి. రామలింగం ఆర్ట్ డైరెక్టర్.గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.
 
‘కెప్టెన్ మిల్లర్’ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
 
సాంకేతిక సిబ్బంది: రచయిత, దర్శకుడు: అరుణ్ మాథేశ్వరన్, నిర్మాతలు: జి. శరవణన్ మరియు సాయి సిద్ధార్థ్,  స‌మ‌ర్ప‌ణ‌: T.G. త్యాగరాజన్, బ్యానర్: సత్యజ్యోతి ఫిల్మ్స్, సంగీతం: జివి ప్రకాష్ కుమార్, సినిమాటోగ్ర‌ఫీ: శ్రేయాస్ కృష్ణ, ఎడిటింగ్: నాగూరన్,  కళ: టి.రామలింగం