సంబంధిత వార్తలు
- అబ్బా.. ఎంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నానో: అల్లు అర్జున్
- గూగుల్‌లో ఇడియట్ అని టైప్ చేస్తే.. ఎవరి బొమ్మ వస్తుందో తెలుసా?
- ముంబైకు చెందిన విద్యార్థికి గూగుల్ బంపర్ ఆఫర్...
- బహిరంగ ప్రదేశాల్లో కూడా వైఫై సేవలు.. చర్చల్లో గూగుల్
- గూగుల్ ట్రెండ్స్‌లో అగ్రస్థానం.. రాధిక కుమారస్వామి పేరు వైరల్.. ఎన్టీఆర్ హీరోయిన్?
సెర్చ్ ఇంజిన్‌నే మెప్పించిన తెలుగు బిడ్డ.. రూ.1.20 కోట్ల వేతనం...
ప్రముఖ ఇంటర్నెట్ సెర్చింజన్ గూగుల్. అలాంటి సంస్థనే ఓ యువతి మెప్పించింది. ఆ యువతి ఎవరో కాదు. మన తెలుగు బిడ్డ. అదీ కూడా తెలంగాణ యువతి. ఇపుడు ఈ యువతి పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది.
ప్రముఖ ఇంటర్నెట్ సెర్చింజన్ గూగుల్. అలాంటి సంస్థనే ఓ యువతి మెప్పించింది. ఆ యువతి ఎవరో కాదు. మన తెలుగు బిడ్డ. అదీ కూడా తెలంగాణ యువతి. ఇపుడు ఈ యువతి పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. దీనికికారణం.. ఆ యువతికి రూ.1.20 కోట్ల వార్షిక వేతనంతో గూగుల్ ఉద్యోగం కల్పించింది. ఇంతకీ ఈ బంపర్ ఆఫర్ కొట్టిన అమ్మాయి పేరు కుడుగుంట స్నేహారెడ్డి. హైదరాబాద్‌లోని వికారాబాద్‌వాసి.
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ఇటీవలే కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తిచేసింది. ఇటీవల జరిగిన స్నాతకోత్సవంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకుంది.
ఇంతలో 'నేచురల్ లాంగ్వేజ్ అండర్‌స్టాండింగ్' ప్రాజెక్టులో పనిచేసేందుకు గూగుల్ మెరికల్లాంటి యువత కోసం అన్వేషణ మొదలుపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న స్నేహారెడ్డి దరఖాస్తు చేసుకుంది. ఆన్‌లైన్‌లో జరిగిన తొలి నాలుగు రౌండ్లను విజయవంతంగా పూర్తి చేసింది. ఇక చిట్టచివరి పరీక్ష కోసం అమెరికా వెళ్లాల్సి ఉండగా, అదేసమయంలో మరో ముఖ్యమైన పరీక్ష ఉండడంతో వెళ్లలేకపోయింది.
అయితే, ఆమె ప్రతిభను గుర్తించిన గూగుల్ ఆ ముఖ్యమైన పరీక్షను కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహించింది. అందులో స్నేహా రెడ్డి సులభంగా ఉత్తీర్ణత సాధించింది. అంతే ఆమెను తమ సంస్థలో పనిచేసే ప్రతిభావంతుల జాబితాలో గూగుల్ కంపెనీ చేర్చింది. స్నేహారెడ్డితో పాటు మరో నలుగురిని గూగుల్ ఎంపిక చేసింది. వీరిలో ఒక్కొక్కరికీ రూ.1.20 కోట్ల వేతనాన్ని ఆఫర్ చేసింది.
