1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
  4. UPSC Civil Services Prelims 2023 Results out

యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు రిలీజ్

UPSC Civil Services Prelims 2023
అఖిల భారత సర్వీసుల్లో అధికారులను భర్తీ చేసేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఏడాది నిర్వహించిన సివిల్ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ 2023 పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను upsc.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఈ ఏడాది మే 28న సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. 
 
ఇందులో మొత్తం 14,624 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరు ఈ ఏడాది సెప్టెంబరు 15న జరిగే మెయిన్స్‌ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హత సాధించారు. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్ష కోసం ఇప్పుడు మళ్లీ డిటైల్డ్‌ అప్లికేషన్‌ ఫామ్‌ - 1 లో దరఖాస్తు చేసుకోవాలని యూపీఎస్పీ తెలిపింది. 
 
ఇందుకు చివరి తేదీని కమిషన్‌ త్వరలోనే వెల్లడించనుంది. ప్రిలిమ్స్‌ కటాఫ్‌, ఆన్సర్‌ కీని సివిల్స్‌ సర్వీసెస్‌ పరీక్ష మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత వెల్లడించనున్నట్లు యూపీఎస్సీ తెలిపింది. 
తర్వాతి కథనం
బీజేపీ అండగా ఉండకపోవచ్చు .. కురుక్షేత్ర సంగ్రామంలో నా సైన్యం ప్రజలే.. : వైఎస్ జగన్