సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 మే 2023 (14:56 IST)

AP Polycet results 2023: 89.56 శాతం మంది విద్యార్ధులు..?

ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి ఎంట్రెన్స్ పరీక్షలో మొత్తం 1,24,021 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి చైర్మన్ చదలవాడ నాగరాణి ప్రకటించారు. 
 
రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష కోసం 1,60,329 అభ్యర్థులు నమోదు చేసుకోగా 1,43,592 మంది హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 296 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 92.94శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొంది.
 
దరఖాస్తు చేసిన వారిలో 89.56 శాతం మంది విద్యార్ధులు ప్రవేశపరీక్షకు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 84 ప్రభుత్వ, 175 ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీల్లోని 29 విభాగాల్లో 70వేల 569 సీట్లు అందుబాటులో ఉన్నాయి.