1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Avinash Reddy skips appearing before CBI for the second time

ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు

YS Avinash Reddy
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల్లో ఈ నెల 22న విచారణకు రావాలని పేర్కొంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు ఇప్పటికే రెండుసార్లు విచారించారు. 
 
ఇటీవల మరోమారు నోటీసులు జారీ చేసింది. ముందస్తు అపాయింట్‌మెంట్‌లు ఉండడంతో విచారణకు రాలేనని సీబీఐ అధికారులకు ఎంపీ లేఖ రాశారు. నాలుగు రోజులు గడువు ఇవ్వాలని అధికారులను కోరారు. అవినాశ్ రెడ్డి తల్లికి అనారోగ్యానికి గురవడంతో శుక్రవారం ఆమెను ఆసుపత్రికి తరలించారు. 
 
దీంతో శుక్రవారం కూడా అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు శనివారం మరోమారు నోటీసులు జారీ చేశారు.
తర్వాతి కథనం
కేరళలో భార్యల మార్పిడి కేసు.. 26 ఏళ్ల మహిళ హత్య..