శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 మే 2023 (15:35 IST)

అవినాష్ విజ్ఞప్తికి సీబీఐ సానుకూల స్పందన.. కానీ శుక్రవారం...

avinash reddy
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కడప వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి విజ్ఞప్తికి సీబీఐ సానుకూలంగా స్పందించింది. ఈ నెల 19వ తేదీన శుక్రవారం ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరుకావాలని మరోమారు నోటీసులు జారీచేసింది. వివేకా హత్య కేసులో దర్యాప్తులో భాగంగా, మంగళవారం సాయంత్రం 4 గంటలకు హాజరుకావాలంటూ అవినాష్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. 
 
వీటిని స్వీకరించిన అవినాష్... విచారణకు హాజరయ్యేందుకు తనకు నాలుగు రోజుల సమయం కావాలని, ముందుగా ఖరారు చేసిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సివుందని చెప్పారు. దీనిపై సీబీఐ అధికారులు సానుకూలంగా స్పందించారు. వచ్చే శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆదేశించింది.
 
మంగళవారం హైదరాబాద్ నుంచి పులివెందులకు అవినాష్ రెడ్డి బయలుదేరారు. ఆయన దారి మధ్యలో ఉన్న సయంలో వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించారు. హైదరాబాద్ నగరంలోని సీబీఐ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని సూచించారు.