Fauji Update: ఫౌజీ తిరుగుబాటు ప్రారంభమయింది, రిలీజ్ పై క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్
Updated: Thu, 16 Jul 2026 (12:41 IST)
రెబల్ స్టార్ ప్రభాస్, ఇమాన్వి, మిథున్ చక్రవర్తి జయప్రద అనుపమ్ ఖేర్ తదితరులు నటిస్తున్న చిత్రం ఫౌజీ. చారిత్రాత్మక నేపథ్యంగా రూపొందుతోన్న ఈ చిత్రం గురించి మేకర్స్ తాజా అప్ డేట్ ఇచ్చేశారు. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం గురించి రకరకాలుగా వార్తలు వినిపస్తున్న నేపథ్యంలో నేడు దర్శక నిర్మాతలు, హీరో క్లారిటీ ఇస్తూ పోస్టర్ కూడా విడుదల చేశారు.
ఫౌజీ తిరుగుబాటు ప్రారంభమవుతుంది అంటూ ప్రభాస్ భీకర యుద్ధం చేసి పంచె కట్టులో రైఫిల్ పట్టుకొని సేద తీరుతున్న ప్రభాస్ లుక్ విడుదల చేశారు. ఇలా ప్రభాస్ పై ఓ క్రేజీ పోస్టర్ తో సినిమా విడుదలని ఈ ఏడాది డిసెంబర్ 3న భారీ ఎత్తున విడుదల చేస్తున్నట్టుగా ఖరారు చేసేసారు.
సాంకేతికంగా చూస్తే, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. ఇంకా సుదీప్ కెమెరా, గీత రచయిత శ్రీ శీతల్‌శర్మ, కోటగిరివెంకటేశ్వరరావు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. అన్ని భాషల్లో విడుదలకాబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.
దేవీ (మురళీకృష్ణ)
నిక్‌నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
మరింత చదవండి