Prabhas: ఫౌజీ షూటింగ్‌పై కీలక అప్డేట్ - ప్రభాస్ రెడీ ఫర్ యాక్షన్ ?
ప్రభాస్ కథానాయకుడిగా ఫౌజీ యాక్షన్-డ్రామా. 1940లలో ఆజాద్ హింద్ ఫోర్స్ ప్రభాస్ సైనికుడిగా నటించాడు, దీనికి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నాడు.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం స్వాతంత్ర పోరాట నేపథ్యంలో సాగుతుంది. ఇందుకు సంబంధించిన షూటింగ్ కొంత భాగం జరుపుకుంది. ఆ తర్వాత కొంతకాలం గేప్ తీసుకుంది. కాగా, ఫిబ్రవరి 6న తిరిగి షూటింగ్ మొదలైంది. హైదరాబాద్ శివార్లో గల ఓ స్టూడియోలో జరుగుతుంది.
తాజా సమాచారం మేరకు యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. నేడు రెబల్ స్టార్ ప్రభాస్ ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. ఇందుకోసం ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పనిచేస్తున్నాడు. కాగా, ఈ చిత్రం 1930 టైంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ ఓ బెటాలియన్ నాయకుడిగా సైనికుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ మంచి స్పందన వచ్చింది. ఆయన పాత్ర భారతంలోని ఏకలవ్వుడి స్పూర్తిగా వుంటుందని తెలుస్తోంది.
గూస్ బంప్స్ తెప్పిస్తుండగా... స్టోరీపై బిగ్ హింట్ ఇచ్చారు డైరెక్టర్ హను. మహాభారతంలో కౌరవుల పక్షాన నిలబడ్డ కర్ణుడు, పద్మవ్యూహాన్ని ఛేదించిన అర్జునుడు, ధైర్య సాహసాలతో తనకు తానే గొప్ప విలు విద్య నేర్చుకున్న ఏకలవ్యుడిని గుర్తు చేసేలా... ధర్మం వైపు నిలబడ్డ ఓ వారియర్ స్టోరీని చూపించబోతున్నట్లు తెలుస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం టైంలో స్వాతంత్ర్య సమర యోధుల హిస్టరీని చూపించనున్నారు.
ఈ మూవీ కోసం ఓ సరికొత్త ప్రపంచాన్నే సృష్టించబోతున్నట్లు దర్శకుడు హను తెలిపారు. 'భారతదేశ వలస రాజ్యాల చరిత్రను ఇది అన్వేషిస్తోంది. కొన్ని విషాదంగా ముగిసిన మరో కథలు అద్బుతం జరిగే విషయాలు ఉండొచ్చు. ఫస్ట్ పార్ట్‌లో ప్రభాస్ రోల్ ఒక కోణంలో సాగితే ప్రీక్వెల్‌లో ఆయన రోల్ కంప్లీట్ డిఫరెంట్‌గా ఉంటుంది.' అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
ఇక ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్. అనుపమ్ ఖేర్, జయప్రద, భానుచందర్, మిథున్ చక్రవర్తి కీలకపాత్రలు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్‌తో మూవీ నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆగస్ట్ 14న సినిమాను విడుదలచేసే పనిలో వున్నారు.