1. వార్తలు
  2. కెరీర్
  3. అవకాశాలు
  4. Last date for PM Internship Scheme 2024 registration on October 25, details

PM internship scheme 2024 ఆఖరు తేదీ అక్టోబర్ 25, వివరాలు ఇవే...

PM Internship Scheme 2024 registration
Prime Minister Internship scheme ఆఖరు తేదీ రేపే... అక్టోబరు 25, 2024. ఈ నెల 12న ప్రారంభమైన ఈ స్కీముకి సంబంధించి తొలిరోజే లక్షన్నర మంది రిజిస్ట్రర్ చేసుకున్నారు. ఈ ఇంటర్న్ షిప్ నమోదు చేసుకున్నవారిలో ఎంపికైన అభ్యర్థులకు 12 నెలల పాటు నెలకి రూ. 5000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. అలాగే రూ. 6,000 వన్ టైమ్ గ్రాంట్ ఇస్తారు. మహీంద్ర-మహీంద్ర, టీసీఎస్ వంటి అగ్రశ్రేణి కంపెనీలు అభ్యర్థులకు ఇంటర్న్ షిప్ అందిస్తాయి. 2024 కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దేశంలోని 500 అగ్రశ్రేణి కంపెనీల్లో 12 నెలల పాటు ఇంటర్న్ షిప్ చేయడానికి విద్యార్థులకు అవకాశం కల్పించడం ఈ పథకం లక్ష్యం. ఆసక్తి కల విద్యార్థులు pminternshipscheme.comలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
 
అర్హత- పదో తరగతి, ఇంటర్ పూర్తి చేసినవారై వుండాలి. ఐటిఐ గ్రాడ్యుయేట్, పాలిటెక్నిక్ డిప్లొమా చేసినవారు కూడా రిజిస్ట్రర్ చేసుకోవచ్చు. బిఎ, బికాం, బిఫార్మ్ తదితర డిగ్రీలు చేసినవారు కూడా అప్లై చేసుకోవచ్చు.
 
వయసు: 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వుండాలి.
అక్టోబర్ 12న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. రేపటితో అక్టోబర్ 25న ముగుస్తుంది. నవంబర్ 7 వరకూ కంపెనీలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నవంబర్ 15న ఎంపికైనవారికి ఆఫర్ లెటర్స్ పంపుతారు. డిశెంబర్ 2 నుంచి మొదటి బ్యాచ్ ఇంటర్న్ షిప్ ప్రారంభమవుతుంది.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
బాలికపై సీఐ అత్యాచార యత్నం, పరారీలో పోలీసు అధికారి