1. వార్తలు
  2. కెరీర్
  3. అవకాశాలు
  4. ONGC Recruitment For 785 Vacancies Announced; Details Here

ఓఎన్‌జీసీలో 785 ఖాళీలు.. దరఖాస్తుల ఆహ్వానం.. గేట్ స్కోర్ ఆధారంగా?

ONGC
ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) ప్రభుత్వ రంగ సంస్థ. అతిపెద్ద క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ కంపెనీల్లో ఒకటి. ఈ నేపథ్యంలో ఓఎన్‌జీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. గేట్ స్కోర్ ఆధారంగా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఓఎన్జీసీ. 
 
మొత్తం 785 ఖాళీలున్నాయి. ఇందులో అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ పోస్టులు 550 ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు తన అధికారిక వెబ్ సైట్‌లో ఏయే స్థానాలు ఖాళీ వున్నాయో చెప్పేలా ఛార్ట్ కూడా విడుదల చేసింది.. ఓఎన్‌జీసీ. 
 
జియో సైన్సెస్, ఇంజనీరింగ్ విభాగాల్లో ఈ- లెవల్ పోస్టుల్ని గేట్ 2019 ద్వారా భర్తీ చేయనుంది. ఇటీవలే 22 సెంటర్లలో అప్రెంటీస్‌షిప్ కోసం 4,014 ఖాళీలను ప్రకటించింది ఓఎన్జీసీ. అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్, జియోలజిస్ట్ వంటి పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ1 లెవెల్ ఉద్యోగానికి వార్షికంగా రూ.19.48 లక్షల జీతం ఆఫర్ చేస్తోంది ఓఎన్జీసీ.
తర్వాతి కథనం
చంద్రబాబుకు సొంత జిల్లాలో రెబల్స్ బెడద.. గెలుపు సాధ్యమా...?